ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ పరిపాలన చూస్తుంటే రాబోయే పదిహేనేళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా వుండే అవకాశం కనిపిస్తుంది . పరిపాలన విషయంలో సీఎం జగన్ కి వంక పెట్టటానికి వీలు లేకుండా పోయింది. దీనితో బాబు జగన్ మీద సామాన్య ప్రజల్లో వ్యతిరేకత తీసుకోని రావటానికి తనకున్న అన్ని వనరులను వాడుతున్నాడు. మీడియాను కావచ్చు, న్యాయ వ్యవస్థలో తనకు కావాల్సిన వాళ్లతో కావచ్చు, వివిధ పార్టీలో తనకున్న అనుకూలమైన వాళ్ళని కూడా ఉపయోగించి జగన్ పై ముప్పెట్ట దాడి చేయటానికి చూస్తున్నాడు.
తాజాగా సిపిఐ పార్టీని కూడా జగన్ మీద ప్రయోగించడానికి సిద్ధం అయ్యాడు. 2019 ఎన్నికల అనంతరం సిపిఐ జనసేన తో కలిసి ప్రయాణం మొదలు పెట్టింది. అయితే పవన్ రాజకీయాలు దగ్గరుండి చూసిన సిపిఐ పార్టీ ఆయనతో కష్టమేనని అనుకుంటున్నా సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ కి దగ్గర కావటంతో అదే సాకుతో సిపిఐ బయటకు వచ్చింది. ఆంధ్రాలో ఒంటరి అడుగెయ్యలేని సిపిఐ బాబు తోడుకోసం ఎదురుచూస్తుంది. ఎలాగూ సీఎం జగన్ సిపిఐ లాంటి పార్టీలను దగ్గరకు తీసుకోడు, ఆ అవసరం కూడా ఆయనకు లేదు. బీజేపీతో కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడకపోవటమే మంచిది.
దీనితో బాబుతో కలిస్తే రాబోయే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా దక్కకపోతుందా అనే ఆశతో ఇప్పటినుండే టీడీపీ కి దగ్గరకావాలని చూస్తుంది. అందులో భాగంగా సీఎం జగన్ మీద మాటల దాడి చేయటం మొదలెట్టారు. దీని వెనుక బాబు హస్తం కూడా ఉందని తెలుస్తుంది. చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రావటంతోనే సిపిఐ రూట్ మార్చి విమర్శల వేడిని పెంచాయి. ఇప్పుడే టీడీపీ తో కలిసిపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కలిగే లాభం ఏమి లేదు, అదే బయట నుండి విమర్శలు చేస్తే దాని ప్రభావం అంతో ఇంతో ఉంటుందని భావించి ఇలా చేస్తున్నారు. అయితే చంద్రబాబు రాజకీయాల గురించి అన్ని తెలిసిన సిపిఐ మరోసారి బాబును నమ్మటం విశేషం.