ప్రస్తుతం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మనసులో మెదులుతున్న ఒకే ఒక్క ఆలోచన అమరావతి. రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించి నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలని ఆయన కలగన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో దూకుడు నిర్ణయాలను తీసుకున్నారు. రైతులను ఆశ పెట్టి, భయపెట్టి వేల ఎకరాలు సేకరించారు. ముందుగా తాత్కాలిక భవనాలు కట్టి పాలన సాగించి ఆతర్వాత శాశ్వత కట్టడాలు నిర్మించాలనే ఆలోచనతో ముందుకెళ్ళారు. ఆ చెత్త ఆలోచనే రాజధానిని ముంచింది. ఎలాగూ ఐకానిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి రాజధానిని వికేంద్రీకరణ చేయడం కొత్త ప్రభుత్వానికి చాలా సులభమైంది. ఐదేళ్ల పాలనలో గ్రాఫిక్స్ చూపించి అమరావతిని కాస్త భ్రమరావతి అనేలా చేశారు తప్ప కానీసం నగర సరిహద్దులు ఏంటి, సిటీకి పిన్ కోడ్ ఏర్పాటు చేసుకోవడం, ఖచ్చితమైన గెజిట్స్ రూపొందించడం లాంటి తప్పనిసరి పనులేవీ చేయలేదు.
ఒక సామజిక వర్గానికే పెద్ద పీఠ వేసి ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారనే ఆరోపణలు కూడా బాబుగారి మీదున్నాయి. ఇన్నాళ్లు అలాంటిదేం లేదని బుకాయించిన చంద్రబాబు ఈరోజు తన మాటలతో ఆ ఆరోపణలు నిజమేనేమో అనుకునేలా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఆగ్రహం తెప్పించేలా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ఆయన అమరావతిని నిలబెట్టడం కోసం ఎమైనా చేయడానికి సిద్దపడురతున్నారు. మొదట దమ్ముంటే జగన్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ విసిరిన ఆయన ఇప్పుడు ఏకంగా జగన్ గనుక మూడు రాజధానుల ఆలోచనను విరమించుకుని అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగిస్తే తన ఎమెల్యేలంతా రాజీనామాలు చేసి అంసెబ్లీని పూర్తిగా జగన్ కు వదిలేసి వెళ్లిపోతామని అనేశారు.
ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో పోరాటాల కోసం పౌరుషంతో రాజీనామాలు చేసిన నాయకుల్ని, పార్టీలను చూశాం కానీ ఇలా ఒక్క కోరిక కోసం ఘన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీని నిర్వీర్యం చేస్తానని స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడే అనడం ఇదే తొలిసారి కాబోలు. చంద్రబాబు ఇంత దుస్సాహసానికి దిగడానికి కారణం కేవలం అమరావతి రైతుల ప్రయోజనాలే అంటే నమ్మలేం. సొంత, తనవారి ప్రయోజనాలు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోరు బాబుగారు. ప్రయోజనాల సంగతి పక్కనబెడితే బాబును ఆ స్టేజికి వచ్చేలా చేసింది మాత్రం జగనే. రాజ్యంగ బలంతో అన్ని విధాలా అమరావతిని లాక్ చేశారు. మూడు రాజధానులకు ఎలాంటి అడ్డంకి లేకుండా చేసుకున్నారు. అందుకే బాబుగారికి పోరాడటానికి కారణాలేవీ కనబడక చివరికి రాజీనామాలు చేసి అసెంబ్లీని మీకే వదిలేసి వెళ్ళిపోతాం అన్నారు. ఇదంతా బాబు చుటూ జగన్ తవ్విన ఊబి. వేరే దారి లేక తన అమరావతి కోసం ఆ ఊబిలోనే కూరుకుపోయారు చంద్రబాబు.