వైసీపీ మంత్రి కొడాలి నాని అందులో 90 శాతం చంద్రబాబును తిట్టిన తిట్లే ఉంటాయి. ఇంకో 10 శాతంలో మాత్రమే చిన్నా చితకా ప్రశ్నలు, సవాళ్లు ఉంటాయి. విఙ్ఞత కలిగిన ఎవరైనా ఆ తిట్లను వదిలేసి, ప్రశ్నలను వింటారు. అయితే తనను తిడుతున్నాడన్న కోపమో, తన కుమారుడు లోకేష్ గురించి హేళనగా మాట్లాడుతున్నాడనే బాధో తెలీదు కానీ నాని మాటల్లో చంద్రబాబుక తిట్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆయన అడుగుతున్న చిన్న చిన్న లాజిక్కులను పట్టించుకోవట్లేదు. అదే ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద చిక్కును తెచ్చి పెట్టింది.
ప్రస్తుతం టీడీపీ టీటీడీలో డిక్లరేషన్ విషయంలో వైసీపీ మీద, వైఎస్ జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దేవాలయాల మీద దాడుల అంశాన్ని మతంతో ముడిపెట్టి బీజేపీ నానాయాగీ చేస్తుంటే దైవ దర్శనానికి వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్ ఇవ్వరని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కొమసాగుతున్న డిక్లరేషన్ ఆచారాన్ని ఎలా తొలగిస్తారు, క్రిష్టియన్ అయిన జగన్ ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం చేయరు అంటూ కొత్త ప్రశ్నలు లెవనెత్తింది. గతంలో కూడ జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆలయంలోకి వెళ్లారని, అది ఖచ్చితంగా ఆలయ సాంప్రదాయాలను అవమానించడమేనని గొడవ చేస్తూ మైలేజ్ పెంచుకుంటున్నారు
దీంతో టీడీపీ కూడ దేవాలయాల డిక్లరేషన్ మీద మాట్లాడటం మొదలుపెట్టింది. వెంకటేశ్వర స్వామిని నమ్మే జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లేదూ అంటూ గొడవ స్టార్ట్ చేసింది. దీంతో సీన్లోకి ఎంటరైనా మంత్రి కొడాలి నాని అనాల్సినవన్నీ అనేసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడ జగన్ ఎంపీ, ప్రతిపక్ష నేత హోదాలో తిరుమల గుడిలోకి వెళ్ళారు. అప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు. అడిగేదేదో అప్పుడే అడగొచ్చుగా. ఇప్పుడే ఎందుకు చంద్రబాబు రాద్దంతం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. బాబుగారు అది వినలేదో, విని పట్టించుకోలేదో తెలీదు కానీ డిక్లరేషన్ విషయంలో జగన్ ను వ్యతిరేకంచాలని తిరుపతి క్యాడర్ ను ఆదేశించారు. అయితే జనం మాత్రం అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడెందుకు ఈ గొడవ చేస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో బాబుగారి డిక్లరేషన్ ప్లాన్ బొక్క బోర్లా పడ్డట్టైంది.