ఈ క్రెడిట్ మొత్తం చంద్రబాబు దే .. ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ నిండా మునిగారు ?

తెలుగు రాజకీయాల్లో సుధీర్ఘమైన అనుభవం కలిగిన కుటుంబం ఏదైనా ఉందంటే అది మాగంటి కుటుంబమే. ఈ కుటుంబానికి దాదాపు 130 సంవత్సరాల అభుభవం ఉంది. తెలుగు రాజ‌కీయాల్లో ఏ కుటుంబానికి లేని అరుదైన ఘ‌న‌త మాగంటి ఫ్యామిలీకే ద‌క్కింది. తండ్రి మాగంటి ర‌వీంద్రనాథ్ చౌద‌రి, త‌ల్లి మాగంటి వ‌ర‌ల‌క్ష్మీ దేవితో పాటు కుమారుడు మాగంటి బాబు ముగ్గురూ స‌మైక్య రాష్ట్రంలో మంత్రులుగా ప‌నిచేశారు. మాగంటి బాబు తాత మాగంటి సీతారామదాసు స్వాతంత్ర్య సమరయోధుడు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా కూడా గెలిచిన మాగంటి బాబు ఆ త‌ర్వాత వైఎస్‌తో విబేధించి టీడీపీలోకి వ‌చ్చారు. 2009లో ఎంపీగా ఓడిన మాగంటి బాబు 2014లో టీడీపీ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు.

2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తరువాత ఆయన తన నియోజక వర్గంలో ఉన్న అందరూ టీడీపీ నేతలతో వివాదాలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి పీత‌ల సుజాత‌తో పాటు అప్పటి పోల‌వ‌రం ఎమ్మెల్యే మొడియం శ్రీనుతో తీవ్రమైన గ్యాప్ నేప‌థ్యంలో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలో గ్రూపు రాజ‌కీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక నూజివీడులో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ముద్దర‌బోయిన వెంక‌టేశ్వర‌రావుకు మాగంటి బాబుకు మ‌ధ్య కూల్ వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండింది. ఇక కైక‌లూరులోనూ మాగంటి బాబు గ్రూపు స‌ప‌రేట్‌గా ఉంది. చివరికి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినా కూడా మాగంటి బాబు తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో చంద్రబాబు కూడా ఆగ్రహం వచ్చింది. చివరికి ఎంపీ సీట్ కూడా బోళ్ల రాజీవ్‌కు ఎంపీ సీటు ఇవ్వాల‌నుకున్నా కొంద‌రు ఎమ్మెల్యేల లాబీతో చివ‌ర‌కు బాబుకే సీటు ఇచ్చారు.

అయితే 2019 ఎన్నికల్లో మాగంటి బాబు 1.65 లక్షల ఓట్లతో ఓడిపోయారు. ఈ ఓటమి వల్ల మాగంటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మాగంటి తన కొడుకైన మాగంటి రాంజీకి రాజకీయ లైన్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. మాగంటి రాంజీ జిల్లా తెలుగు యువ‌త అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు. దేవినేని అవినాష్ ఖాళీ చేసిన ఏపీ తెలుగు యువ‌త అధ్యక్ష ప‌ద‌విపై సైతం ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం మాగంటి కుటుంబం అవసరం లేదన్న రీతిగా వ్యవహరిస్తున్నారు. మాగంటి రాంజీ అసలు చంద్రబాబు దృష్టిలోనే లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని బ‌ట్టే ఎప్పుడో 125 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌లో ప్రారంభ‌మైన ఈ ఫ్యామిలీ అప్రతిహ‌త రాజ‌కీయం టీడీపీలో ముగియనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.