ఉండేవాళ్ళు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు.. బాబుగారి నయా సిద్ధాంతం 

Chandrababu Naidu not afraid of them  
రాజకీయాల్లో వలస పక్షులతో ఎప్పటికైనా ప్రమాదమే.  అవకాశవాదంతో కండువాలు మార్చే ఈ బ్యాచ్ పార్టీల పునాదులని కదిలించగలవు.  మోసపోయి అందలం ఎక్కిస్తే తలా బొప్పి కట్టేలా తొక్కడం స్టార్ట్ చేస్తారు.  ఇలాంటివారు టీడీపీలో చాలామందే ఉన్నారు.  2014 ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న తర్వాత వైసీపీని నేలమట్టం చేయాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు వలసలను   విపరీతంగా ప్రోత్సహించారు.  ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి  లాగేశారు.  వారిలో కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టారు.  ఇక ఎన్నికల్లో గెలవని నాయకులు సైతం అధికార పార్టీ అండ ఉంటే బాగుంటుందని పచ్చ కండువా కప్పేసుకున్నారు.  ఇలా వచ్చిన వీరంతా టీడీపీని దారుణంగా దెబ్బతీశారు. 
Chandrababu Naidu not afraid of them
అధికారమే పరమావధిగా భావించి వచ్చిన ఈ నాయకులు టీడీపీ అధికారంలో ఉండగా దోచుకోవడం, దాచుకోవడం అనే కాన్సెప్ట్ మాత్రమే ఫాలో అయ్యారు.  ప్రజల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.  ఫలితంగా పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయింది.  చివరికి ఆ 23 సంఖ్యలోనే ప్రతిపక్షంలో కూర్చుంది.  దీంతో రియలైజ్ అయిన చంద్రబాబు ఈసారి అలాంటివారికి సీన్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు.  కొత్తగా ప్రకటించిన పార్టీ పదవుల్లో జంపింగ్ నేతలను  పక్కనపెట్టేశారు.  మొదటి నుండి పార్టీనే నమ్ముకున్నవారికి బాధ్యతలు అప్పగించారు.  లైమ్ లైట్లో లేని నాయకులకు సైతం బాబుగారు పదవులు కట్టబెట్టదానికి రీజన్ అదే.  వాళ్ళైతే పార్టీని వదిలి వెళ్లారని, ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో ఉన్నారనే నమ్మకం. 
 
  
ఎప్పుడైతే టీడీపీ ఓడిపోయిందో అప్పటి నుండే పార్టీ మారే యోచనలో ఉన్న పిరాయింపు నేతలు వైసీపీలో సిట్యుయేషన్ అంత ఈజీగా లేదని తెలుసుకుని చేసేది లేక టీడీపీలోనే ఉండిపోయారు.  భవిష్యత్తులో ఎప్పుడు వీలుదొరికినా వీళ్లంతా జెండా పీకేవారే.  కానీ ఇప్పడు టీడీపీలో ఉన్నాం కాబట్టి పార్టీ పదవులు కావాలని పట్టుబడుతున్నారు.  లాబీయింగ్ చేస్తున్నారు.  కానీ చంద్రబాబు మాత్రం బెదరట్లేదు.  నిర్ణయాలను కనీసం పునరాలోచించే ప్రసక్తి కూడ లేదని తేల్చి చెప్పేశారు.  దీంతో ఆగ్రహించిన సదరు లీడర్లు అనుకూల మాధ్యమాల ద్వారా టీడీపీ పెదవులని అవుట్ డేటెడ్ నాయకులకు అప్పగించారని, వారి వలన ఓఆర్టీకి ఒరిగేదేమీ లేదని, తమకు అన్యాయం చేశారని ప్రచారం స్టార్ట్ చేశారు.  పదవులు,అధికారం ఉన్నప్పుడే సక్రమంగా పనిచేయమని వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఎలా పనిచేస్తారు, వాళ్ళను పట్టించుకోకండి.  ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్లు పోతారు అనే ధోరణిలో ఉన్నారట చంద్రబాబు.