2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో టీడీపీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. ఇప్పటికే అనేకమంది టీడీపీ నాయకులు వైసీపీ బాట పట్టారు. టీడీపీ తరపున గెలిచిన నేతలు కూడా వైసీపీ చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాలకు భయపడి వైసీపీలోకి వెళ్లారు. ఇలా వరుసగా వైసీపీ నుండి ఇబ్బందులు వస్తుండటంతో టీడీపీ నేతల్లో ఉత్సహం తగ్గింది. ఆ నేతల్లో ఉత్సహం నింపడానికి పార్టీకి అచ్చెన్నాయుడు ను ప్రెసిడెంట్ గా నియమిస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే అచ్చెన్నాయుడు పేరుకు మాత్రమే ప్రెసిడెంట్ అని, చెయ్యాల్సిన పనులన్ని బాబు, లోకేష్ మాత్రమే చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
అచ్చెన్న పేరుకే ప్రెసిడెంట్
చంద్రబాబు పేరుకు జాతీయ అధ్యక్షుడు. కానీ ఆయన చేసేవన్నీ గల్లీ పోరాటాలే. ఇసుక కొరత అంటూ ఆయనే తట్ట అందుకుంటారు. రైతులకు అన్యాయం అంటూ తడిసిన వరి కంకులతో అసెంబ్లీకి వచ్చినా బాబే ముందున ఉంటారు. ఇలా అన్నింటికీ తానే ముందుంటూ అచ్చెన్నను ముందుకు రానివ్వడం లేదని అచ్చెన్న అభిమానులు బాధపడుతున్నారు. తాను కాలికి గజ్జె కట్టుకుని మరీ ఏపీ అంతా చుట్టి వస్తానని అచ్చెన్న భీషణ ప్రతిన కూడా చేశారు. అది కూడా మళ్లీ చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయడానికేనని కూడా వినయంగా చెప్పుకున్నారు. కానీ అచ్చెన్నాయుడిని కాలు బయటకు కదపకుండా బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇలా అచ్చెన్నను చంద్రబాబు నాయుడు అడుగడున అడ్డుకుంటూనే ఉన్నారు. ఇలా అడ్డుకునే దానికి ప్రెసిడెంట్ ను చెయ్యడం ఎందుకని రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.
లోకేష్ కోసమే…
రానున్న రోజుల్లో లోకేష్ ను ముఖ్యమంత్రిని చెయ్యలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు. అందుకోసమే ఇప్పటి నుండే లోకేష్ ను ప్రజల మధ్యన ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ పర్యటన చేయాలన్నా టీడీపీ తరపున లోకేష్ నే ముందుకు పంపుతున్నారు. లోకేష్ ను రాజకీయంగా బలపరచడానికి అచ్చెన్నను బాబు తొక్కేస్తున్నారు. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కదా అంటే ఆయన అయితే నిమ్మాడలో లేకపోతే గుంటూర్ ఆఫీస్ లోని కుర్చీలో కూర్చోడమేనట.