టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి దారుణంగా ఉంది. ఓటమితో సగం ఆత్మస్థైర్యం కోల్పోయిన ఆయన ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరు చేజారిపోతుంటే ఏమీ చేయలేక మరింత కుంగిపోతున్నారు. ఇప్పటివరకు నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ పార్టీకి దూరమవగా మరొక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పార్టీ మారడానికి ముహూర్తం పెట్టుకుని కూర్చున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోనుంది. ఇలా ఎమ్మెల్యేలు జారిపోతూ ఉంటే పార్టీ ప్రతిపక్ష హోదాను కూడ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు బయటకు వెళుతున్న ఎమ్మెల్యేలంతా తర్వాతి అసెంబ్లీ సమావేశాల్లో తమను టీడీపీ ఎమ్మెల్యేలుగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఇవ్వమని కోరతారు. ఆ గుర్తింపే వారికి వస్తే టీడీపీ ప్రతిపక్ష హోదాకే ముప్పు.
ఈ పరిణామాలన్నీ తెలిసినా చంద్రబాబు ఎలాంటి చర్యలకూ పూనుకోవడంలేదు. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీని వీడాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిస్తే వాళ్లను సంప్రదించి మాట్లాడటం, వాళ్ళు బాబు మాటలకు కన్విన్స్ కాకపోవడం, చివరికి పార్టీని వీడటం జరుగుతున్నాయి తప్ప ఒక్క ఎమ్మెల్యేను కూడ బాబు ఆపలేకపోయారు. అసలు వెళ్తామన్నవారు ఆగాలంటే వారికి భవిష్యత్తు మీద గట్టి భరోసా కల్పించాలి. పార్టీ పుంజుకుంటుందని, అధికార పక్షం నుండి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాపాడుతుందని హామీ ఇవ్వగలగాలి. చంద్రబాబు అక్కడే విఫలమవుతున్నారట. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారట. చివరికి ఎమ్మెల్యేల మాటలకే కన్విన్స్ అయిపోయాయి మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేస్తున్నారట.
చివరికి ఎమ్మెల్యేలు జగన్ వద్దకు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు వైసీపీ కండువా కప్పగానే మిగిలిన ఎమ్మెల్యేలంతా ఇదేమిటని బాబు వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే పోతే పోనివ్వండి, వాళ్లునా పార్టీని నిలబెట్టేదేమీ లేదని వైరాగ్యపు మాటలు గాలివాటం నేతలు పార్టీలో ఉంటే ఎంత లేకపోతే ఎంత.. వాళ్ళు కాకపోతే ఇంకొకరు అంటూ కాసేపు పౌరుషపు మాటలు మాట్లాడుతున్నారట. ఆయన మాటలు విన్న నేతలకు ఇది విరక్తా, కోపమా, పంతమా అనేది అర్థంకాక గాలి చూపులు చూసుకుంటున్నారట.