తెలంగాణ రాజకీయాలలో వేలు పెడుతున్న చంద్రబాబు.. కేసీఆర్ కు నష్టమేనా?

chandrababu kcr telugu rajyam

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు లేవు. 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం కేవలం 23 అసెంబ్లీ స్థానాలలో మాత్రమే విజయం సాధించడంతో టీడీపీ అభిమానులు నిరాశ చెందారు. నారా లోకేశ్ వల్ల కూడా టీడీపీకి నష్టం కలుగుతోందంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు తెలంగాణ రాజకీయాలకు దూరమయ్యారని గతంలో ప్రచారం జరిగింది.

అయితే ఖమ్మం, వరంగల్ లలో తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది. అందువల్ల తెలంగాణలో జరిగే ఎన్నికలపై దృష్టి పెట్టాలని కొన్ని స్థానాలలో గెలిచినా తెలంగాణలో చక్రం తిప్పగలనని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. తెలంగాణలో హంగ్ వస్తే ఏదైనా పార్టీకి మద్దతు ఇచ్చి తెలంగాణలో కూడా తెలుగుదేశం సత్తా చాటేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

ఇంతకాలం కేసీఆర్ కు అనుకూలంగా వార్తలు రాసిన తెలుగుదేశం అనుకూల పత్రికలు సైతం ప్రస్తుతం కేసీఆర్ కు వ్యతిరేకంగా కథనాలను ప్రచురిస్తుండటం గమనార్హం. తెలంగాణలో గత కొన్నేళ్లలో కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్నాయి. ఈ పార్టీలు మరింత పుంజుకుంటే మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు జనసేన కూడా తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెడుతోంది.

తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలలో కాకపోయినా అనుకూల పరిస్థితులు ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ చరిష్మా తగ్గుతుండటం వల్లే ఈ పార్టీలు రాజకీయాలపై దృష్టి పెడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే తెలంగాణ ప్రజలు ఈ పార్టీలను నమ్ముతారో లేదో అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ, జనసేన సైలెంట్ కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన తెలంగాణపై దృష్టి పెడితే టీ.ఆర్.ఎస్ కు కొంతమేర నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.