గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీకి మద్దతివ్వడం హాట్ టాపిక్ ఆయిన్ సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీని చంద్రబాబు నాయుడు బాగానే చూసుకున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వంశీ వ్యక్తిగతంగా బలమైన నేతే అయినా గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి మంచి బలమే ఉంది. ఆ పార్టీ తరపున వంశీనే కాదు అలాంటి అభ్యర్థిని ఇంకొకరిని నిలబెట్టినా గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ వంశీ మాత్రం అక్కడ టీడీపీ తన మూలంగానే బతికి ఉంది అంటుంటారు. అప్పటివరకు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆకాశానికెత్తిన వంశీ ఉన్నట్టుండి మారిపోయారు.
చంద్రబాబు లాంటి దుర్మార్గుడు లేదు అంటూ వైసీపీతో చేతులు కలిపారు. దీంతో గన్నవరం టీడీపీ శ్రేణులు నాయకుడు లేక సతమతమయ్యాయి. ఎవరి విషయం ఎలా ఉన్నా వంశీ విషయంలో మాత్రం బాబుగారు బాగా హార్టయ్యారు. అందుకే వంశీకి రాజకీయంగా పాఠం నేర్పాలని డిసైడ్ అయి గన్నవరం ఇన్ ఛార్జ్ బాధ్యతల కోసం కొత్త వ్యక్తిని వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతగ్గా వెతగ్గా ఆయనకు దొరికిన నేత బచ్చుల అర్జునుడు. టీటీడిపీ ఎమ్మెల్సీ అయినా అర్జునుడు అయితేనే వంశీని ఢీకొట్టి పార్టీని నిలబెట్టగలడని చంద్రభాబు గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి వైఎస్ జగన్ మీద బచ్చుల అర్జునుడు చేస్తున్న పోరాటమే.
అర్జునుడు వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో లోపాలు వెతుకుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని మార్పు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, దళితులపై దాడులు, టీడీపీ నేతల అరెస్టులు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ లాంటి అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను అర్జునుడు గట్టిగా వ్యతిరేకిస్తూ తన గొంతుకను వినిపిస్తున్నా. అంతేకాదు చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తున్న వంశీ మీద పేలిపోతున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయనకు నియోజకవర్గంలో మంచి సంబంధాలే ఉన్నాయి. పార్టీ శ్రేణుల్లో కూడ ఆయనకు మంచి పేరుంది. ఇవన్నీ కలిసొచ్చి రానున్న మూడున్నరేళ్లలో అర్జునుడు వంశీకి ఎదురుగా బలమైన ప్రత్యామ్నాయంగా తయారుకాగలడని బాబుగారు ఆలోచన చేసి ఉండవచ్చు.