జగన్ సరే నీ సంగతేంటి బాబు

cbn

 చంద్రబాబు విజన్ కి తిరుగులేదని కొందరు భజనపరులు పదే పదే చెప్పేమాటలు. అంత గొప్ప విజన్ ఉంటే మొన్నటి ఎన్నికల్లో 23 కి ఎందుకు పరిమితం అయ్యాడంటే మాత్రం సమాధానం ఉండదు, ఇక అలాంటి విజన్ కలిగిన బాబు తాజాగా సీఎం జగన్ గురించి మాట్లాడుతూ జగన్ కి 30 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అంటూ తన విజన్ ను మరోసారి ఆవిష్కరించాడు. గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో నిర్వ‌హించిన స‌మ‌న్వ‌య స‌మావేశంలో మాట్లాడిన బాబు అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) అనే ఢిల్లీ సంస్థ త‌న నివేదిక‌లో ఈ వివరాలు పేర్కొన్న‌ట్టు తెలిపాడు.

Chandra Babu telugu rajyam

 నిజానికి ఈ సంస్థ ఏమి జగన్ కేసులు విచారించే న్యాయస్థానం కాదు. ఇప్పటికే జగన్ మీద ఉన్న కొన్ని కేసులు కొట్టివేయటం జరిగింది. మరికొన్ని విచారణ స్థాయిలో ఉన్నాయి. కానీ అప్పుడే బాబు జగన్ కు పడబోయే జైలు శిక్ష గురించి ఏవేవో నివేదికల్లో పేర్కొన్నారంటూ మాట్లాడుతూ తన వక్రబుద్ధి చూపిస్తున్నాడు. జగన్ కేసులు తేలే సమయానికి ఎలాగు తేలుతాయి. కోర్టు పరిధిలో వున్నాయి కాబట్టి కొంచం ఆలస్యమైనా నిజానిజాలు బయటకు వస్తాయి. మరి చంద్రబాబు మీద వున్నా కేసుల విషయమేంటి. తనమీద ఉన్న కేసులు పదిహేను ఏళ్ళు హీరింగ్ కి రాకుండా “స్టే” లు తెచ్చుకున్న ఘనత బాబు గారిది. సీఎం పదవి అడ్డుపెట్టుకొని అక్రమాస్తులు సంపాదించాడంటూ చంద్రబాబు అత్తగారు లక్ష్మి పార్వతి కేసు వేస్తే, తన పలుకుబడి ఉపయోంగించి దాని నుండి తప్పించుకు తిరుగుతున్నాడు.

  తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి అమరావతికి వచ్చిన బాబు ఆ కేసు గురించి కూడా మర్చిపోయాడేమో కానీ, కోర్టు మాత్రం మరువలేదు. ఈ రెండు కేసుల విచారణను తిరిగి మొదలుపెట్టింది. ఇక మీదట రోజువారీ విచారణ చేయటానికి కూడా కోర్టు సిద్దమైయింది. మరి ఈ కేసులో బాబు దోషిగా తేలితే ఎన్ని ఏళ్ళు శిక్ష పడుతుందో ఆ ఢిల్లీ నివేదికలో లేదేమో… ఇప్పటికే జగన్ దెబ్బకి రాష్ట్రము వదిలిపెట్టి పక్క రాష్ట్రంలో ఉంటూ జూమ్ బరబర జూమ్ అంటూ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకి, 2024 లో కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే పాపం జూమ్ లో కూడా కనిపించే పరిస్థితి లేకుండా పోతుంది. ముందు వీటి గురించి ఆలోచించండి బాబు గారు, ఆ తర్వాత జగన్ కి పడే శిక్షల గురించి ఆలోచించుకోవచ్చు.