చంద్రబాబు రివర్స్ గేర్ వేస్తే లోకేష్ ఏకంగా యూటర్న్ తీసుకున్నాడు 

Chandrababu, Lokesh unhappy with EC
నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.  ఎన్నికల్లో అధికార వైసీపీదే  పైచేయి అయింది.   కేలీన్ స్వీప్ చేస్తామన్న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే పంచాయతీలను నిలుపుకోలేకపోయారు.  చంద్రబాబుగారి లెక్కల మేరకు తెదేపా మద్దతుదారులు 4230 స్థానాల్లో గెలిచారట.  గత ఎన్నికల కంటే ఈసారి 6 శాతం ఓట్ షేర్ తగ్గిందని లేకుంటే వైసీపీ పని ముగించేసేవాళ్లమని చెప్పుకొచ్చారు.  మరి ఓట్ షేర్ తగ్గడానికి కారణం ఎన్నికల కమీషనర్ నిర్వీర్యం కావడమే అంటున్నారు.  మొదటి నుండి ఈసీకి భీభత్సమైన రీతిలో సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు.  టీడీపీ నేతలు ఆయన్ను హీరోలా ఎలివేట్ చేశారు.  జగన్ మీద పోరాడుతున్న యోధుడు, రాజ్యాంగాన్నీ కాపాడటనికి నడుం బిగించాడు అంటూ ఆకాశానికెత్తారు.  కానీ ఇప్పుడు ఆయన పనితీరుని శంకిస్తున్నారు.  
 
Chandrababu, Lokesh unhappy with EC
Chandrababu, Lokesh unhappy with EC
మొదట్లో ఈసీ పనితీరు పట్ల ఆనందంగానే ఉన్న టీడీపీ మొదటి, రెండవ విడతల ఎన్నికలతో అభిప్రాయాన్ని మార్చుకుంది.  చంద్రబాబుగారే నేరుగా ఈసీ సక్రమంగా పనిచేయలేదని అనేశారు.  స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన ఉండగా ఈసీ నిర్వీర్యమై నిస్సహాయ స్థితిలోకి వెళ్లిందని అందుకే వైకాపా మెజారిటీ స్థానాలను సంపాదించింది అన్నారు.  ఈసీ గనుక సక్రమంగా పనిచేసి ఉంటే గెలుపు తమదేనని చెప్పుకొచ్చారు.  మరోవైపు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు బాగా జరిగాయని, సిబ్బంది పనితీరును కొనియాడుతున్నారు.  అసలు ఈసీని మొదటి నుండి నెత్తినపెట్టుకున్న ప్రతిపక్ష నేత ఫలితాలు తర్వాత ఇలా ప్లేటు మార్చడం చూస్తే రివర్స్ గేర్ రాజకీయం  గుర్తొస్తుంది.   
 
ఇక నారా లోకేష్ అయితే ఎన్నికల్లో నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే అంటున్నారు.  ఎన్నికలో ఓడిపోయిన పార్టీలు గెలిచిన పార్టీల మీద విమర్శలు గుప్పించడం, ఎన్నికలు అక్రమ రీతిలో జరిగాయని అనడం షరా మామూలే.  అదే లోకేష్ కూడ చేశారు.  ప్రజాస్వామ్యానికి-జగన్‌ రెడ్డి నియంతృత్వానికి మధ్య జరిగిన స్థానిక ఎన్నికల సంగ్రామంలో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదే అయినా  అసలు సిసలు గెలుపు టీడీపీదే అని అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను, జగన్‌రెడ్డి తన తాత రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు.  నామినేషన్ల దగ్గర్నుండి రీకౌంటింగ్ వరకు అన్ని దశల్లోనూ అక్రమాలే జరిగాయని మాట్లాడారు.  మొత్తానికి తండ్రీ కొడుకులు ఎన్నికల కమీషనర్ మీద, ఎన్నికలు జరిగిన విధానం మీద తీవ్రాతి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.