ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ ల పర్వం కోనసాగుతోంది. అవినీతి..అక్రమాలకు పాల్పడ్డ నేతలపై జగన్ సర్కార్ కొరడా ఝుళిపించడం కొనసాగుతోంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడ్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు అధికార పక్షం – ప్రతిపక్షం నేతల మధ్య మాటల యుద్ధం అంతే ధీటుగా కొనసాగుతోంది. ఇంకెతమంత మంది టీడీపీ నేతలు కుంభకోణాల్లో ఇరుక్కుంటారోనన్న! టెన్షన్ వాతావరణం నేతల్లో అలుముకుంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా వైకాపా మంత్రి పేర్ని నాని ఆ ముగ్గురు రెడీగా ఉండాలంటూ హెచ్చరించారు.
దీంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తేదాపా మాటలకు బధులిచ్చే క్రమంలో మంత్రి అలా నోరు జారడం అంతటా చర్చకొచ్చింది. మంత్రి ఏమన్నారంటే? నారా లోకేష్ మాటల దాడిలో భాగంగా మంత్రి నాని లోకేష్ కి విసిరారు. ఎక్కడైనా నేను చర్చకు సిద్దం. ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్న, ఎన్ ఓసీ కింద అక్రమాలకు పాల్పడ్డ జేసీ ప్రభాకర్ రెడ్డిల బండారం బయటపడింది. మీలాంటి వారు నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని ఎద్దేవా చేసారు. అచ్చెన్న, జేసీలు అక్రమాలకు పాల్పడలేదని చంద్రబాబు కి బహిరంగంగా ప్రజల ముందుకొచ్చి చెప్పే ధైర్య ఉందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్, ఉమాలకు ముందుంది ముసళ్ల పండగని హెచ్చరించారు. అక్రమాలకు, కుంభ కోణాలకు పాల్పడ్డ టీడీపీ నేతలంతా అన్ని రకాలుగా సిద్దమై ఉండాలని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్న ఎంతగా ఎగిరెగిరి పడ్డారో ప్రజలందరికీ తెలుసునని…ఈరోజు ఆయన పాపం పండిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అసెంబ్లీలో మాట్లాడుతున్ నప్పుడు ఆయనగారు అంతగా ఏం పొడిచారని ఎద్దేవా చేసారు. నాని చేసిన వ్యాఖ్యలిప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.