విపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖలో జరిగినా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అదే పనిగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో వీడియో కన్పారెన్స్ ద్వారా మరోసాని ఆయన అక్కసాన్ని వెళ్లగక్కారు. ఈ పరిశ్రమ అత్యవసర సేవల విభాగం కిందకు రాదుగా, అలాంటప్పుడు దీన్ని ఎలా తెరుస్తారు? ఎవరీకి ప్రాణాలు తీసే హక్కు లేదు. ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే కేవలం ఆ ఫ్యాక్టరీలోని కార్మికులే చనిపోయే అవకాశం ఉంటుంది. కానీ, మొదటిసారి ఏపీలో సాధారణ ప్రజలు చనిపోయారు. ఇందుకు కారణమైన వారు ఎంతటి వారైనా వదలిపెట్టడానికి వీల్లేదని మండిపడ్డారు.
లాక్ డౌన్ వల్లే ప్రమాదం జరిగిందా? అన్న విషయాన్ని లేవనెత్తారు. ప్రమాదం జరిగేముందు సైరెన్ ఎందుకు మ్రోగలేదు. దీనిపై సిఎం జగన్ స్పందించిన తీరు బాగాలేదని ఎద్దేవా చేసారు. ఇలాంటి ప్రమాదాలను తేలికగా తీసుకునే విధంగా ఆయన చేసిన సీఎం ప్రకటన ఉందని విమర్శించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా శ్రేణులు భగ్గుమన్నారు. చంద్రబాబు అప్పుడే కరోనా రాజకీయాలు మొదలు పెట్టారు. అసలు ఆ కంపెనీ ఎప్పుడు ఓపెన్ చేసారు. గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ప్రమాదకరంగా మారుతుందని భావించే యాజమాన్యం ట్యాంకర్లో ఒత్తిడి తగ్గించే క్రమంలో అనుకోకుండా సాంకేతిక కారణల వల్ల లీకైంది.
ఆ సమయంలో కంపెనీలో 15 మందే ఉన్నారు. ఓ పెద్ద కంపెనీ ఓపెన్ చేస్తే 15 మందే పనిచేస్తారా? ఓ పెద్ద కంపెనీలో ఎంత మంది ఉద్యోగులుంటారా? చంద్రబాబుకి తెలియదా. ప్రమాదం జరుగుతుందని భావిస్తే సైరెన్ మ్రోగిస్తారు? అసలు అక్కడ ప్రమాదమే జరుగుతుందని ఊహిచనప్పుడు సైరన్ ఎందుకు మ్రోగించాలి? ఎవరి ప్రాణాలు ఎవరూ తీసేయలేదు? సాంకేతిక లోపం కారణంగా చోటు చేసుకున్న సంఘటన ఇది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలో ఎలా చేసారో ఆయనకు తెలియదా? అంటూ వైకాపా నేతలు మండిపడ్డారు. ఆయన మాటలు…చేష్టలు కరోనా వైరస్ కన్నా ప్రమాదం. అంతకు మంచి నిన్న లీకైన స్టిరీన్ గ్యాస్ కన్నా చంద్రబాబు ప్రమాదకరమంటూ వైకాపా శ్రేణులు కౌంటర్ వ్యాఖ్యలు చేసారు.