చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం.. ఆ నేతకు గట్టిగా దిగిందా.. ?

babu telugu rajyam

 

ఏపీ రాజకీయాల్లో వర్గపోరు ఎక్కూవే అన్న విషయం తెలిసిందే.. ఇక కుల రాజకీయాల గురించి ప్రత్యేకించి వివరించవలసిన అవసరం లేదు.. ఒకరకంగా కులము ఏపీ రాజకీయాలను శాసిస్తుందని చెప్పవచ్చూ.. ఇలా ఈ కుల రాజకీయాల వల్ల మెజారిటి సాధించి పదవులను అలంకరించిన వారున్నారు, పదవీచ్యుతులు అయిన వారున్నారు.. అందుకే ఏపీ రాజకీయాలు ఎప్పుడు సలసల కాగుతున్న నూనెలా ఉంటాయంటారు.. ఇకపోతే తమ వర్గం వారు రాజకీయాల్లో రాటుతేలడానికి ఎందరో ఆ వర్గం వారు పరోక్షంగా మద్దతు ఇస్తారు.. వీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినా తమ వారి పార్టీకి వెన్నుముఖలా ఉంటారు.. ఇలాంటి వారిలో ఎమ్మెల్సీ ఏఎస్ రామ‌కృష్ణ ఒక‌రు.

ఉపాధ్యాయ వ‌ర్గాల‌కు చెందిన ఈయ‌న ప‌రోక్షంగా చంద్రబాబుకు మ‌ద్దతుదారు. అంతే కాకుండా గ‌తంలో చంద్రబాబు క‌నుస‌న్నల్లోనే మెలిగారు. అంతేకాదు.. ఇటీవ‌ల మూడు రాజ‌ధానుల బిల్లు మండ‌లికి వ‌చ్చిన‌ప్పుడు.. తీవ్రంగా విభేదించారు కూడా. ఇలా ఉపాధ్యాయ వ‌ర్గాల కోటా నుంచి మండ‌లికి ఎన్నికైనా కూడా తరచుగా టీడీపీకి సానుకూలంగా వ్యవ‌హ‌రిస్తుంటారు.. ఇంతటి ముఖ్య నాయకున్ని ప్రస్తుతం ఇబ్బందులు తరుముతున్నాయట.. అదీ చంద్రబాబు వల్ల..

ఇకపోతే 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా 1800 ఓట్ల మెజారిటీతో గుంటూరు జిల్లాకు చెందిన రామ‌కృష్ణ గెలుపొందారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులు అందరూ మద్దతు తెలిపారు. కానీ, ఇప్పుడు చంద్రబాబుతో పాటుగా వారంతా ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి ఎంతో చాకిరి చేశానని, చంద్రబాబును ఎంతో నమ్మానని, ప్రతి క్షణం పార్టీ గురించి ఆలోచించే నన్ను ప్రస్తుతం ప‌క్కన పెట్టార‌ని వాపోతున్నారు.. ఇలాగైతే రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగ‌బోతున్నట్టు ప్రక‌టించారు.

ఈ విషయం తెలిసిన ఇతర నాయకులు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ఈ నేతకు గట్టిగా దిగింది కావచ్చూ అందుకే విలవిలలాడుతున్నాడు అని ముచ్చటించుకుంటున్నారట.. ఏది ఏమైనా తన పార్టీ నుండి గోడలు దూకుతున్న నాయకులను ఆపడంలో చంద్రబాబు విఫలం అవుతున్నాడనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.. ఇలాగైతే రానున్న కాలంలో బాబు టీడీపీ పార్టీని సోషల్ మీడియాలోనే చూడవలసి వస్తుంది అని అనుకుంటున్నారట..