చంద్రబాబు.. రాజకీయాల్లో పండితుడు. వ్యూహాలు రచించడంలో దిట్ట. ఎదుటి వ్యక్తి ఎంతటి వాళ్లు కానీ.. తను వేసే ఎత్తుగడల ముందు ఉత్తదే. ఆయన దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో మహామహులను చూశారు. ఆయన అనుభవం ముందు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులంతా బలాదూర్.
ఇప్పుడు చంద్రబాబును పొగడ్తల్లో ముంచేయాల్సిన అవసరం ఏం వచ్చింది అంటే.. చంద్రబాబు వల్ల ఇప్పుడు రాయలసీమ బతికి బట్ట కట్టే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా.. అయినా కూడా ఆయన రాయలసీమను ఎలా రక్షించారు అనే డౌటనుమానం మీకు వచ్చి ఉంటుంది.
గత కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం కోసం తెలంగాణ సర్కారు ఎంతలా ప్రయత్నిస్తున్నదో అందరికీ తెలిసిందే. ముందు ఏపీ సీఎం జగన్ తో దోస్తీ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్… రాయలసీమకు హాండ్ ఇవ్వాలని చూసింది.
కానీ.. నీటి వాటా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని ఏపీ సీఎం జగన్ కూడా మొండికేసినా.. కేసీఆర్ ముందు జగన్ తేలిపోయారు. ఏ వాదనలోనూ జగన్ నెగ్గలేకపోయారు. కృష్ణా బోర్డులో, సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ అన్నింట్లో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసింది.
దీంతో చంద్రబాబు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు.. పట్టుపట్టి తెలంగాణ ప్రభుత్వంతో చేయించిన ఓ ఒఫ్పందం ఇప్పుడు రాయలసీమను కాపాడబోతోంది.
అదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కూడా కాపాడబోతోంది. తెలంగాణలో అప్పటికే పూర్తయిన ప్రాజెక్టులను ప్రూఫ్స్ గా చూపించి.. వాటిని ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఏపీలోని రాయలసీమ ప్రాజెక్టులకు అడ్డు రాకూడదు… అని తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది ఏపీ ప్రభుత్వం. ఆ ఒప్పందమే ఇప్పుడు రాయలసీమ పథకాన్ని అడ్డులేకుండా చేస్తోంది. అదే రాయలసీమ ప్రయోజనాలను కాపాడుతోంది.
తెలంగాణలోని బీమా పథకం ప్రారంభించుకోవడం కోసం అప్పట్లో సీఎం కేసీఆర్.. ఏపీ ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేయించుకున్నారు. బీమా పథకం ఉమ్మడి ఏపీలోనే పూర్తయినందున.. దానికి 20 టీఎంసీల నీళ్లు ఇవ్వాలంటే… రాయలసీమ పథకాలకు అడ్డురాకూడదు.. అని ఆ ఒప్పందాన్ని చేసుకున్నారు.
ఆ ఒప్పందమే ఇప్పుడు ఏపీని, ఏపీ ప్రభుత్వాన్ని, రాయలసీమను తలెత్తుకునేలా చేసింది. చంద్రబాబు ఒక్కోసారి ఏం చేసినా.. ఏపీ మేలు కోసమే చేస్తారు.. అనడానికి ఇదే మంచి ఉదాహరణ అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పుడు చంద్రబాబు చేసిన పని.. ఇప్పుడు జగన్ ప్రభుత్వాన్ని సేవ్ చేసినట్టయింది. ఇది జగన్ ప్రభుత్వానికి కలిసొచ్చింది.