ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి వివరణను ప్రభుత్వం ఇచ్చింది. మరి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుతంత్రాలకు ఎందుకు పూనుకోరు? అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా కరెంట్ బిల్లుల పెంపును నిరసిస్తూ చంద్ర బాబు తెలుగు తమ్ముళ్లకు పిలుపు నిచ్చాడు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని మండలాలు, నిజయోజక వర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఫాలోవర్స్, అంతా ఇళ్లలో ఈనెల 21న నిరసన దీక్షలు చేయాలని పిలుపు నిచ్చారు. నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రజలు కరోనా కష్టాల్లో అల్లాడుతుంటే కరెంట్ బిల్లులు పెంచడం దారణమని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు పెంచారంటూ బాబు ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగి తీసుకుని ఇప్పుడు తొక్కడం మొదలు పెట్టారని ఎద్దేవా చేసారు. పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని, ఫిబ్రవరి బిల్లుకు సమానమైన బిల్లులనే లాక్ డౌన్ మూడు నెలల్లో కూడా కట్టించుకోవాలని డిమాండ్ చేసారు. శ్లాబులను మార్చే చర్యకు స్వస్తి చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఎప్పుడు కరెంట్ చార్జీలు పెంచలేదన్నారు. ఎన్నికల సమయంలో కూడా బిల్లులు తగ్గించి ఇచ్చామని అన్నారు.
దేశంలోని డిస్కమ్ లకు కేంద్రం 90 వేల కోట్లు రాయితీలిస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఛార్జీలు పెంచి జనాలను బాదపెట్టడం దుర్మార్గం అన్నారు. అయితే బాబు ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఇంట్లో దీక్ష చేపట్టడం ఇదే ప్రప్రథమం. అలాగే తెలుగు తమ్ముళ్లుకు ఇది తొలి అనుభవం అవుతుంది. ఈ దీక్షను ఎంత మంది చేస్తారన్నది సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతుంది. తెలుగు తమ్ముళ్లకు పార్టీ పట్ల ఉన్న నిజాయితీ ఎంత అన్నది 21వ తేదీన అధినేతకు ఓ క్లారిటీ కూడా వస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రోడ్డెక్కి నడిస్తేనే పెద్దగా జనం రాలేదు. మరి ఈసారి ఏకంగా ఇంట్లో ఉండే దీక్షలు చేయమని పచ్చ తమ్ముళ్లకు పిలుపు నిచ్చారు. ఏం జరుగుతుందో ? ఏమో!