తెలంగాణలో ఓవైపు గ్రేటర్ ఎన్నికలు జరుగుతుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ అటువైపే చూడటం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తున్నప్పటికీ వాళ్లు మాత్రం గ్రేటర్ వైపే చూడటం లేదు. కనీసం వాళ్లు ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడం లేదు.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నారా లోకేశ్ బాగానే ప్రచారం చేశారు కానీ.. టీడీపీకి అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నారా లోకేశ్ తెలంగాణ వైపే చూడలేదు. నిజానికి.. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ నారా లోకేశ్ ప్రచారం చేస్తారు అనే టాక్ వచ్చినప్పటికీ దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
ఇక.. చంద్రబాబు కూడా ఎందుకు తెలంగాణలో ఎన్నికలు అంటేనే వెనక్కి పోతున్నారు. పార్టీ పరంగా అభ్యర్థులను నిలబెడుతున్నారు కానీ.. పార్టీ తరుపున ఎన్నికల ప్రచారానికి తెలంగాణకు రావాలంటేనే వణికిపోతున్నారు చంద్రబాబు. హైదరాబాద్ ను నేనే కట్టా.. అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడం లేదు.. తాను కట్టిన హైదరాబాద్ లో తానే ప్రచారం చేసుకోలేకపోతున్నారా? అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి.
నిజానికి తమది జాతీయ పార్టీ అని చెప్పుకోవడం కోసమే తెలంగాణలో టీడీపీ పార్టీని ఇంకా కొనసాగిస్తున్నారట. అందుకే తెలంగాణలో ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు కాస్త హడావుడి చేసి అభ్యర్థులను నిలుపుతున్నారట. ఏపీతో పాటు మరో రాష్ట్రంలోనూ తమ పార్టీ ఉనికి ఉంది అని చెప్పుకోవడం కోసమే తప్ప.. ఎన్నికల్లో గెలవడం కోసం కాదని.. అందుకే.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తండ్రీకొడుకులిద్దరూ దూరంగా ఉన్నారంటూ టాక్ వినిపిస్తోంది.