Chandamama Kajal : గ్లామర్ ప్రపంచం అంటే కొన్ని రకాల కట్టుబాట్లకు లొంగి వుండాల్సిందే. అందులో ముఖ్యమైనవి పెళ్లి, పిల్లల్ని కనడం. అందుకే కెరీర్ డల్ అయిపోయిన తర్వాతనే ముద్దుగుమ్మలు పెళ్లి, పిల్లలు.. అంటూ తన పర్సనల్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ, కాజల్ అగర్వాల్ మాత్రం ఆ మార్పుల్ని తన జీవితంలో చాలా ఆనందంగా ఆహ్వానించింది.
హీరోయిన్‌గా కెరీర్‌లో బిజీగా వున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకుంది. ఓ పక్క కెరీర్‌నీ, మరోపక్క వైవాహిక బంధాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది. కాబోయే తల్లిగా తాను అనుభవించిన మధురానుభూతుల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంది.
తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్, ఆ బిడ్డకు సంబంధించి తొలి అనుభూతుల్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది. కాజల్ బిడ్డ (నీల్)ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఒకింత భావోద్వేగానికి లోనైంది. అందులోంచే అమితమైన ఆనందాన్ని పొందానని చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్.
తొలిసారి బిడ్డ స్పర్శను తాకిన కాజల్, తాను పొందిన అనుభూతి జీవితంలో ఎప్పటికీ మర్చపోలేనని చెప్పింది. బిడ్డకు జన్మనివ్వడం వల్ల స్కిన్ లూజవ్వడం, స్ర్టెచ్ మార్కులు.. తదితర మార్పులతో ఇకపై తాను ఆకర్షణీయంగా కనిపించలేకపోవచ్చేమో కానీ, అందంగానే ఉంటాను.. అని కాజల్ చెప్పడం అభిమానుల్ని ఆలోచింపచేస్తుంది.
ఓ స్టార్ హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ దక్కించుకున్న అభిమానం అపారమైనదే. కానీ, ఈ క్షణంలో అంతకు మించి అమితమైన అభిమానం ఓ తల్లిగా కాజల్ అగర్వాల్ సొంతం చేసుకుంది.. అనడంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదేమో.