రామ్ చరణ్ హీరో అవ్వడం చిరంజీవికి ఇష్టం లేదా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమ కొడుకుల్ని హీరోలుగా చెయ్యాలని అనుకుంటారు. కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు. ఎన్టీఆర్, నాగేశ్వర్ రావు, తమ వారసులు బాలకృష్ణ, నాగార్జున లని స్టార్ హీరోలుగా చూసారు. కానీ కృష్ణ కొడుకు రమేష్ బాబు హీరో గా సక్సెస్ కాలేకపోయాడు. అయితే మహేష్ బాబు మాత్రం సూపర్ స్టార్ అయ్యాడు.

అలాగే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా స్టార్ హీరో అయ్యాడు. కానీ చిరంజీవికి మాత్రం రామ్ చరణ్ ని హీరో చెయ్యడం అసలు ఇష్టం లేదంట. ఎందుకంటే సినిమాల్లో విజయాలు ఎప్పుడూ రావు. ఎదగనీయకుండా తొక్కేవారు ఎప్పుడూ కాచుకుని కూర్చుంటారు. చిన్న తప్పు చేసినా పేరును బద్నాం చేసే వాళ్లు ఉంటారని చిరు భయపడ్డాడట..చరణ్ మంచి నటుడు కాకపోతే చిరుకు బ్యాడ్ నేమ్ వస్తుందని, అసమర్థ కుమారుడికి జన్మనిచ్చావని తనను బ్లేమ్ చేసే రోజు రావొద్దని అనుకున్నారట.

అయితే రామ్ చరణ్ కి చదువులో పెద్ద గా ఇంటరెస్ట్ లేకపోవడం, తనకు కూడా సినిమాల్లోనే కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనిపించడంతో చిరంజీవి సరే అన్నారు. తాజాగా RRR  సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.