ఆ విషయంలో మెగా హీరోలని మించిపోయిన అక్కినేని నాగచైతన్య..?

Naga Chaitanya

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. స్వయంకృషితో చిరంజీవి మెగాస్టార్ గా ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఈ తండ్రీ కొడుకులను మించిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

సినిమాల పరంగా చూసిన మెగా హీరోల కన్నా నాగచైతన్యకు హిట్స్ తక్కువ వచ్చాయి. కానీ ఇటీవల మెగా హీరోలను మించిపోయిన నాగచైతన్య అని వస్తున్న వార్తలు దేని గురించి అని అర్థం కావటం లేదు. అయితే ఈ వార్తలు వినిపించడం వెనక కూడా ఒక కారణం ఉంది. ఒక విషయంలో నాగచైతన్య ఈ మెగా హీరోలను ఇద్దరిని మించిపోయాడు. బంగార్రాజు, లవ్ స్టోరీ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న నాగచైతన్య ఇటీవల థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద డిజాస్టర్ గా నిలిచింది. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోగల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ‘థాంక్యూ’ సినిమా నాలుగో రోజు ఉదయం ఆటకు కేవలం 12,440 రూపాయలు మాత్రమే రాబట్టింది. అయితే అదే థియేటర్లో ఆచార్య సినిమా అదే షోకి 12,309 రూపాయలతో సరిపెట్టుకుంది.

ఈ విధంగా చూస్తే రామ్ చరణ్, చిరంజీవి నటించిన ఆచార్య సినిమా కన్నా నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కొంచెం ఎక్కువ వసూలు చేసిందని అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ మెగా హీరోల కన్నా నాగ చైతన్య బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ థాంక్యూ సినిమా నష్టాలను మూటగట్టుకుంది. కొంతకాలం క్రితం విడుదలైన ఆచార్య సినిమా కూడా ఇదే విధంగా మేకర్స్ కి నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా వల్ల చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ తీవ్రంగా నష్టపోయారు. వీరిద్దరికీ ఆచార్య సినిమా దాదాపు 100 కోట్ల వరకు నష్టాన్ని తెచ్చిపెట్టింది.