తిరుమలలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం తెల్లవారు జాము సమయంలో తిరమల అలిపిరి నడక మార్గంలో దొంగల్ హల్‌చల్ చేశారు. అలిపిరి నడక మార్గంలో ఏడోమైలు రాయి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు భక్తులను ఫ్లాష్ లైట్ తో వెంబడించి చైన్ స్నాచింగ్‌కు ప్రయత్నించారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు నగడక మార్గంలో వెళ్లుతండగా తమ వద్ద ఉన్న బంగారాన్ని దోచుకోవడానికి దుండగులు యత్నించారని కర్నూలుకు చెందిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడక మార్గంలో 2,830వ మెట్టు దగ్గర ఘటన జరిగినట్లు చెబుతున్నారు. దొంగల నుంచి తప్పించుకోడానికి పరుగులు పెట్టామని.. ఆదివారం రాత్రి 11గంటలకు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి భక్తులను కాపాడారు. నడక మార్గంలో దొంగలు కనిపించడంతో భక్తులు భయపడుతున్నారు.
అయితే వెంటనే అప్రమత్తమైన భక్తులు 100 నెంబర్‌కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. భక్తులను దగ్గరుండి మరీ సురక్షితంగా తిరుమలకు తరలించారు. దీనితో నడకదారిలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.