అబ్బ.. నిజంగానే ఏపీ ప్రభుత్వానికి ఇది తీపి కబురు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న తరుణం ఇది. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ కేంద్రాన్ని ఎంతలా ఆదుకోవాలని కోరుతున్నారో అందరికీ తెలిసిందే. తాజాగా.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది.
పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం నిం రీయంబర్స్ మెంట్ కింద 2234 కోట్లను మంజూరు చేసింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను నాబార్డు డీజీఎం వికాశ్ భట్ జారీ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ డబ్బు.. ఏపీ ఖజానాలో జమ అవనుంది. రీయంబర్స్ మెంట కోసం కేంద్రం ఆర్థిక శాఖకు జల శక్తి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.
నిజానికి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. కేంద్రమే దీన్ని నిర్మించాలి. 2016 వరకు కేంద్రమే నిధులు కేటాయించేది. కానీ.. అప్పటి ప్రభుత్వంతో కేంద్రానికి వచ్చిన గ్యాప్ వల్ల రాష్ట్ర ప్రభుత్వమే దాని నిర్మాణ వ్యయాన్ని భరించాల్సి వచ్చింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 12 వేల కోట్లను ఖర్చు పెట్టింది. దాంట్లో పీపీఏ కింద 8500 కోట్లను నాబార్డు విడుదల చేసింది. మిగిలిన 4 వేల కోట్లను రియంబర్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా.. అందులో 2234 కోట్లను తాజాగా విడుదల చేసింది.