యుకె ప్రయాణాలకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ !

బ్రిటన్ లో స్ట్రెయిన్ వైరస్ వెలుగులోకి రావడంతో ప్రపంచం మొత్తం మళ్లీ వణికిపోయి , బ్రిటన్ తో ఉన్న సంబంధాలు తాత్కాలికంగా నిలిపేశాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. కరోనా స్ట్రెయిన్ దెబ్బకి జనాలు భయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా బ్రిటన్ తో విమాన ప్రయాణాలను రద్దు చేసిన పరిస్థితి మనం చూసాం. చాలా దేశాలు ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చిన వారి కోసం గాలం వేసాయి. భారత్ కూడా రద్దు చేసింది.

ఈ నేపధ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జనవరి 8 నుంచి భారత్, యునైటెడ్ కింగ్‌ డమ్ మధ్య విమానాలు పాక్షికంగా తిరిగి ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం తెలిపారు. 2021 జనవరి 8 నుండి భారతదేశం మరియు యుకె మధ్య విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని నిర్ణయించామని అని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.

ప్రారంభంలో, జనవరి 23 వరకు, రెండు దేశాల విమానాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు మరియు హైదరాబాద్ నుండి మాత్రమే వారానికి 15 విమానాలకు అనుమతులు ఇచ్చామని అన్నారు. అంటే ప్రతి దేశ క్యారియర్‌ లకు వారానికి 15 విమానాలకు మాత్రమే అనుమతి. అంటే భారతీయ క్యారియర్లు ఎయిర్ ఇండియా మరియు విస్టారా వారానికి 15 విమానాలు మాత్రమే నడిపే అవకాశం ఉంటుంది. బ్రిటిష్ క్యారియర్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ మరియు వర్జిన్ అట్లాంటిక్ వారానికి 15 విమానాలు వస్తాయి.