ఫ్రీ వైఫై కోసం ఆశపడిన యువకుడు… జరిగింది తెలిసి షాక్ లో యువకుడు!

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వాడకం పెరగటం వల్ల రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్, బస్టాండ్లు, కేఫ్ లు రెస్టారెంట్లు, జన సమూహం ఎక్కువగా ఉండే చోట ఎక్కువగా ఫ్రీ వైఫై అని ఆఫరిస్తుంటారు. వీటికి కొన్ని రోజుల ముందు వరకు బాగానే డిమాండ్ ఉండేది, అయితే ఇప్పుడు అందరి మొబైల్స్ లో కావలసినంత డేటా ఉంటుంది. కానీ కొంతమంది యువకులు అది కూడా తక్కువ అయ్యి… ఫ్రీ వైఫై అని కనిపించగానే వెంటనే తమ మొబైల్ డేటాను ఆఫ్ చేసి వైఫై కి కనెక్ట్ చేస్తుంటారు. ఇలా ఫ్రీ వైఫై కోసం ఆశపడిన యువకుడికి ఫ్యుజులు ఎగిరిపోయే సంఘటన ఎదురైంది

వివరాల్లోకి వెళితే…. కుమార్ అనే యువకుడు గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టడానికి మరియు అతని ఖర్చులకోసం కుటుంబ సభ్యులు కొంతమంది ఆ యువకుడి అకౌంట్లో జమ చేశారు. అకౌంట్లో డబ్బులు ఉంచుకొని అలా సిటీ చూడటానికి బయటికి వెళ్ళాడు యువకుడు. అలా వెళ్తున్న క్రమంలో ఒక షాపింగ్ మాల్ దగ్గర ఫ్రీ వైఫై సిగ్నల్ కనిపించింది, వెంటనే తన మొబైల్ డేటా ఆఫ్ చేసి వైఫై కనెక్ట్ చేశాడు. వైఫై వాడుతుండగా కాసేపటి తర్వాత వెంటనే తన మొబైల్ కి కొన్ని మెసేజ్ లు వచ్చాయి. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్న యువకుడు సడన్ గా కంగుతిన్నాడు. అకౌంట్లో నుండి డబ్బులు కట్ అయినట్టు ఆ మెసేజ్ లోఉంది .

దీంతో వెంటనే అప్రమత్తమైన యువకుడు షాపింగ్ మాల్ యాజమాన్యం వద్దకు వెళ్లి ఫ్రీ వైఫై అని చెప్పి తన అకౌంట్లో డబ్బులు కాజేస్తారా అంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. అయితే తమ మాల్ లో ఎటువంటి ఫ్రీ వైఫై కనెక్షన్ లేదు అని షాపింగ్ మాల్ యాజమాన్యం చెప్పడంతో తాను మోసపోయాను అని గ్రహించిన యువకుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.