ఆన్ లైన్ లో టిఫిన్ కోసం వెతికి రూ. 89000 పోగొట్టుకున్న బామ్మ..?

ప్రస్తుత కాలంలో సులభంగా డబ్బు సంపాదించడం కోసం అనేకమంది తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది దొంగతనాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదిస్తుంటే మరి కొంతమంది ఇతరులను మోసం చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారు. అయితే ఇలాంటివారు అమాయకులను ఆసరాగా చేసుకుని వారిని సర్వం దోచుకుంటున్నారు. ఇటీవల కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ లో టిఫిన్ కోసం వెతుకుతున్న బామ్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక వ్యక్తి 89 వేల రూపాయలు కాజేసిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…ముంబై కి చెందిన ఓ 50 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో తనకు భోజనం తీసుకురావడానికి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ప్రతిరోజు టిఫిన్ భోజనం తెప్పించుకునేది. అయితే తనకి రెగ్యులర్ గా టిఫిన్ తెచ్చి ఇచ్చే వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆన్‌లైన్‌లో టిఫిన్ కోసం వెతకటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆన్లైన్లో ఒక వ్యక్తి నంబర్ గుర్తించి ఆ నంబర్ కి టిఫిన్ కోసం మెసేజ్ పెట్టింది. అయితే ఆ వృద్ధురాలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న సదరు నిందితుడు మొదట యాక్టివేషన్ ఛార్జ్‌గా రూ.5 పంపమని అడిగాడు.

దీంతో ఆ వృద్ధురాలు ఆ నంబర్‌కు రూ.5 పంపింది. ఆ తర్వాత అతడు వృద్ధురాలితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకొని మెల్లగా ఆమెతో మాటలు కలిపి ఆ వృద్ధురాలి అకౌంట్‌లో నుండి రూ.89,000 కాజేశాడు. అయితే కొంత సమయం తర్వాత తన అకౌంట్ లో డబ్బులు లేకపోవడం గమనించిన వృద్ధురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వయసు పై పడటంతో బయటికి వెళ్లి టిఫిన్ తెచ్చుకోవటం చేతకాక ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలని ప్రయత్నించి ఇలా 89000 పోగొట్టుకోవటంతో ఆ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. చేసింది. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం