2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపుకోసం ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ ఇప్పుడు తిరుపతిలో జరగనున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మాత్రం గెలవడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే అక్కడ గెలవడానికి ఒక రాజకీయ సలహాదారుణ్ణి కూడా నియమించారు. ఈ ఉప ఎన్నికలో గెలిచి ఇప్పటికే వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పడానికి బాబు ప్రయత్నిస్తున్నారు కానీ టీడీపీ నాయకులే ఇందుకు సహకరించకపోగా అడ్డుపడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఉన్న టీడీపీ నాయకులు పార్టీకి పెద్ద ముప్పుగా మారారు.
పత్తా లేకుండా.. సహాయం లేకుండా
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఉంది. గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ గెలిచింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థికే మెజారిటీ వచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన హైదరాబాద్ కే పరిమితమయ్యారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి బాబు అనేక ప్రయత్నాలు చేస్తుంటే శ్రీకాళహస్తిలో ఉన్న టీడీపీ నాయకులు మాత్రం కనీసం బయటకు కూడా రావడం లేదు.
బొజ్జల శ్రీధర్ పై చర్యలా!!
దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకునే నేత లేకుండా పోయారు. ఇటీవల చంద్రబాబు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఒకరకంగా బొజ్జల సుధీర్ కు చంద్రబాబు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. రాజకీయ భవిష్యత్ కావాలంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలని, పార్టీ అప్పగించిన కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్లు తెలిసింది. లేకుంటే ఇన్ ఛార్జిని మార్చాల్సి ఉంటుందని ఆయన బొజ్జల సుధీర్ రెడ్డికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.