ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ వ్యూహాలకు గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు బలి అయ్యారు. అయితే 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలోను, రాజకీయాల్లోనూ టీడీపీ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబు యొక్క వ్యూహాలు ఇప్పుడు వైసీపీ ముందు పని చెయ్యడం లేదు. వైసీపీ వల్ల వచ్చిన ఓటమిని టీడీపీ నాయకులు ఇంకా జీర్ణించుకోలేపోతున్నారు. అయితే ఇప్పుడు తమ మళ్ళీ బలపడిందని నిరూపించుకోవడానికి తిరుపతి ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలని బాబు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బాబు వేసిన వ్యూహం బాబు రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చేలా ఉందని టీడీపీ సీనియర్ నాయకుల ఆవేదన.
బాబు చేసిన తప్పు
2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం వచ్చినా కూడా ఇంకా వైసీపీ కానీ బీజేపీ కానీ టీడీపీని చూసి ఎందుకు భయపడుతున్నాయంటే అక్కడ 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ఉన్నారని. ఆయన ఉన్నంతకాలం టీడీపీని ఏమి చేయలేమని ఆ నాయకులకు కూడా తెల్సు. అయితే ఇప్పుడు కేవలం తిరుపతి జరిగే ఉప ఎన్నికల్లో గెలవడానికి బాబు వేసిన రాజకీయ వ్యూహం ఆయనకు ఉన్న రాజకీయ అనుభవం, ఇతర పార్టీ నాయకులకు ఉన్న బాబు అంటే ఉన్న భయం గంగలో కలిసి పోయాయి. ఆ తప్పు ఏంటంటే తిరుపతి ఉప ఎన్నిక కోసం రాబిన్ శర్మ అనే ఒక రాజకీయ సలహదారుడుని బాబు నియమించారు. ఈ విషయం పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నాయకులకు నచ్చడం లేదు.
బాబు కంటే ఎక్కువ రాబిన్ కు తెలుసా!!
40 రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కంటే కూడా ఈ రాబిన్ శర్మకు ఎక్కువ తెలుసా అని టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రాబిన్ శర్మ గతంలో ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేశారు. ఒక ఉప ఎన్నిక కోసం రాజకీయ సలహాదారుణ్ణి నియమించి బాబు తనంటే ఇతర పార్టీ నాయకులకు ఉన్న భయాన్ని తొలగించారని, ఇది పార్టీకి, బాబుకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు, పార్టీ సీనియర్ నాయకులు చెప్తున్నారు.