అసెంబ్లీ నుంచి పారిపోయి.. ఈ సింపతీ గేమ్ ఏంటి బాబూ.?

వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళారా.? లేదంటే, తన ఆవేదన వెల్లగక్కుకోవడానికి వెళ్ళారా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై సోషల్ మీడియా వేదికగా పడుతున్న సెటైర్లివి. అసెంబ్లీలో తన భార్యను కించపర్చేలా మాట్లాడారంటూ కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు, అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన విషయం విదితమే.

చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వాటి కారణంగా సంభవించిన వరదల నేపథ్యంలో బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళిన చంద్రబాబు, తన పర్యటనల ద్వారా సింపతీ పొందేందుకు మేగ్జిమమ్ ప్రయత్నిస్తున్నారు.

నా భార్యను కించపర్చారంటూ చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలతో వరద బాధితులు అవాక్కవుతున్నారు. ‘మీరు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారా.? లేదంటే, మా నుంచి మీరు ఓదార్పుని ఆశిస్తున్నారా.?’ అని వరద బాధితులే చంద్రబాబు మీద సెటైర్లు వేస్తున్నారట.

ఇంకోపక్క మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తనదైన స్టయిల్లో సింపతీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘మా అమ్మని కించపర్చారు..’ అంటూ లోకేష్ వాపోతున్నారు. ఇంతకీ, చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు ఏమని కించపర్చారు.? దానికి సంబంధించి ఆడియో లేదా వీడియో ఏమైనా వుందా.?

‘మేం ఆమెను కించపర్చలేదు.. కించపర్చం కూడా..’ అని వైసీపీ కుండబద్దలుగొట్టేస్తున్నా, టీడీపీ మాత్రం ఇంకా అదే సింపతీ గేమ్ ఆడుతూ వస్తోంది.