AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటాయి నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అధికారపక్షం ప్రతిపక్షం వార్తలలో నిలుస్తూ ఉంటారు అయితే 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలో అద్భుతమైన విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఎన్నికలలో చెప్పిన విధంగా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారు.
సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెన్షన్ చెప్పిన విధంగానే పెంపుదల చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసిన అది అందరికీ వర్తించలేదని తెలుస్తుంది. ఇలా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో కొందరు కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసిపి నాయకులు జైలుకు వెళుతున్న విషయం మనకు తెలిసిందే.
గత ప్రభుత్వ హయామంలో వైసిపి నేతలు తమని ఇబ్బందులకు గురిచేసారని, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోము అంటూ నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు అయితే వారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎంతోమంది వైసీపీ నేతలు ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఇచ్చిన హామీలన్నింటినీ పక్కనపెట్టి కక్ష సాధింపు చర్య రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఇక ఈయన పోలీసు వ్యవస్థను కూడా పూర్తిస్థాయిలో తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు అధికార ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని, తమ పార్టీ నేతలను కార్యకర్తలను అనవసరంగా ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోమని చెబుతున్నారు.
అధికార నేతలకు కొమ్ముకాస్తూ తమపై వివక్షత చూపే అధికారులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నా పట్టుకొస్తామని తెలిపారు. ఇటీవల పోలీసులను హెచ్చరిస్తూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలిప్పించి నిలబెడతా అంటూ తనదైన శైలిలోనే ఈయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు దీంతో అధికారులు కూడా ఒకింత వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. ఇలా ఏపీలో అధికారం చంద్రబాబుది అయినా అధికారులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారని తెలుస్తుంది.