రాజకీయాల్లో శాశ్వత శత్రులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఎవ్వరు ఉండరనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే ఇట్టే బోధపడుతుంది. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకుడైన చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బీజేపీని ఇష్టమొచ్చినట్టు తిట్టారు. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు కూడా బీజేపీ జత కట్టడానికి పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఉపయోగించి తమ రాజకీయ శత్రువులను దెబ్బతియ్యడానికి ఇద్దరు నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
బాబుకు బీజేపీ అస్త్రాన్ని ఎక్కుపెట్టిన జగన్
అసలే పతనానికి చేరువలో టీడీపీని భూస్థాపితం చెయ్యడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు చేసిన అక్రమాలను బయటపెట్టే పనిలో జగన్ పడ్డారు. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ చేసిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కానీ జగన్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబుపై చర్యలు తీసుకుంటే ఆ ఆరోపణలు నిజమని ప్రజలు అనుకునే అవకాశం ఉంది, అలాగే దీని వల్ల టీడీపీపై ప్రజల్లో సింపతీ పెరుగుతుంది. ఇలా జగన్ జరగకూడదని భావిస్తున్న జగన్ బాబుపైకి బీజేపీని ప్రయోగించనున్నారు. బీజేపీ ఎలాగో తనను ఎన్డీయేలో చేరమని అడుగుతుంది కాబట్టి ఈ ఆధారాలను బీజేపీకి ఇచ్చి అక్కడి నుండి చంద్రబాబుపై చర్యలు తీసుకుంటేనే ఎన్డీయేలో చేరుతాననే కండిషన్ పెట్టనున్నారు.
బాబుకు కష్టాలు తప్పవా!
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు వైసీపీ నేతలను అడుకోవడమే కాకుండా ఇష్టమొచ్చినట్టు అక్రమాలకు పాల్పడ్డారని, వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఏ తప్పు చేయకపోయినా జగన్ మోహన్ రెడ్డిని కుట్రపూరితంగా జైలుకు పంపారని, ఇప్పుడు ఇన్ని అక్రమాలు చేసిన బాబును కూడా కచ్చితంగా జైలుకు పంపుతామని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ జగన్ పతకం ప్రకారం బీజేపీ బాబుపై విరుచుకుపడితే రానున్న రోజుల్లో బాబుకు జైలుకు వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.