రెండేళ్ల క్రితం మోడీ ఆఫీస్ లో చంద్రబాబు కి అంత అవమానం జరిగిందా ? లేటుగా బయటపడ్డ నిజం !

Modi Chandrababu Telugu Rajyam

రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది కాని ఇప్పటికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ నాయకులు తమ ఆవేదనను ఇంకా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విభజన తరువాత జరిగిన కీలక అంశాల గురించి, 2014లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి, ప్రత్యేక హోదా గురించి ఆయన పోరాటం గురించి, ఆయనకు జరిగిన అవమానాల గురించి తాజాగా బయటకు వచ్చాయి.

cbn telugurajyam
cbn telugurajyam

బాబుకు మోడీ ఆఫీస్ లో అవమానం

రాష్ట్ర విభజన సమయంలో బాధ్యతగల స్థానంలో ఉన్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ ఈ మొత్తం వ్యవహారం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. “ఎన్‌కే సింగ్‌ పోర్ర్టెయిట్స్‌ ఆఫ్‌ పవర్”‌ అనే ఒక పుస్తకం రాసారు. ఈ పుస్తకంలో అనేక అనేక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చాలా భావోద్వేగానికి గురి అయ్యారని, అలాగే రాష్ట్ర విభజన బిల్లు, ఫైనాన్షియల్‌ మెమోరాండం లేకుండా ప్రవేశ పెట్టారని, ఇది సరైన పద్దతి కాదని అప్పుడే అనుకున్నామని అన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతోనే టీడీపీ. అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిశారని, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగానే, ఆయన బీజేపీ నుంచి దూరం అయ్యి, ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని అన్నారు. ఇస్తామని చెప్పి తరువాత బాబును బీజేపీ నేతలు అవమానించారని ఎన్కే సింగ్ తెలిపారు.

ప్రత్యేక హోదా గురించి జగన్ ప్రశ్నించారా!!

కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తారనే నమ్మకంతోనే అధికారం ఇచ్చారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు బీజేపీకి ప్రాణ స్నేహితుడిగా ఉంటున్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. పైగా వాళ్ల దగ్గరకే రహస్యంగా వెళ్లాయి కలిసి వస్తున్నారు. ప్రశ్నిస్తే తనపై ఉన్న కేసులను మళ్ళీ పైకి తిస్తారనే భయంతోనే జగన్ ప్రత్యేక హోదా గురించి బీజేపీని అడగటం లేదని, బీజేపీ అంటే జగన్ కు భయమని టీడీపీ నేతలు చెప్తున్నారు.