కడప నడిబొడ్డులో వివేకా కేసులో సిబిఐ కి కీలక సీక్రెట్ తెలిసింది ..!

2019 ఎన్నికల సమయంలో హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి కేసుపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే గత నెల 17న సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విచారణ నిమిత్తం కడప, పులివెందుల ప్రాంతాలకు కూడా వెళ్లారు. రెండు వారాలపాటు రాష్ట్రంలో హడావిడి చేసిన సీబీఐ అధికారులు తరువాత కనిపించకుండా వెళ్లారు.
CBI to investigate YS Vivekananda Reddy murder case
సీబీఐ అధికారుల జోరు చూసి కొన్ని రోజుల్లో వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను బయటపెడ్తుందని అందరూ భావించారు కానీ ఢిల్లీకి వెళ్లిన సీబీఐ ఇంకా రాష్ట్రానికి మళ్ళీ రాలేదు.

ప్రధాన నిందితులు, కీలక సాక్ష్యులను, సిబిఐ, ఈ సమయంలో విచారణ చేసింది. వి-వే-క కూతురు సునీతను, పలుమార్లు సిబిఐ ప్రశ్నించింది. సునీత కూడా ఒక బ్యాగ్ నిండా ఆధారాలు తీసుకు వచ్చి, సిబిఐకి అప్పచేప్పారనే వార్తలు, ఫోటోలు వచ్చాయి. అయితే సిబిఐ విచారణ దూకుడు చూసి, ఈ కేసు తొందరలోనే ఒక కొలిక్కి వచ్చేస్తుందని, అందరూ భావించారు. సిబిఐ ఇంత వేగంగా విచారణ చెయ్యటంతో, తొందర్లోనే అసలైన వారు దొరికిపోతారని అందరూ అనుకున్నారు. అలాగే కేసులో అనుమనాతులుగా ఉన్న సిఐ శంకరయ్య, వైసిపీ ముఖ్య నేత శంకర్ రెడ్డి, వివేక పీఏ, వంట మనిషి, వాచ్ మెన్ ను సిబిఐ ప్రశ్నించింది. గతంలో వేసిన సిట్ బృందాల చేసిన దర్యాప్తు రిపోర్ట్ లను సిబిఐ తెప్పించుకుని పరిశీలించింది. అలాగే మరికొందరి ముఖ్యులు, ప్రజా ప్రతినిధులను కూడా ప్రశ్నిస్తారనే ప్రచారం కూడా సాగింది.

అయితే గత నెలాఖరున సిబిఐ బృందం ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తాం అని చెప్పి, సిబిఐ బృందం ఢిల్లీ వెళ్ళిపోయింది. వరుసుగా సెలవులు ఉండటంతో, సెలవలు అయిన తరువాత వస్తారని అందరూ భావించినా, 22 రోజులు అయినా సిబిఐ నుంచి ఎలాంటి సమాచారం లేదు. రెండు వారాల పాటు దడ దడ లాడించి, ఒకేసారి బ్రేక్ పడటంతో, కారణం ఏమిటి అనేదాని పై చర్చ జరుగుతుంది. త్వరలోనే సిబిఐ మళ్ళీ వస్తే, ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అయితే సీబీఐ ఇంకా రాష్ట్రానికి రాకపోవడం వెనక బలమైన కారణం ఉందనే వాదన కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ఈకేసుకు సంబంధించి ఒక కీలక విషయం తెలిసిందని, దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుందని, త్వరలో రాష్ట్రానికి వచ్చి కేసులో కీలక విషయాలను వెల్లడిస్తుందని విశ్వసనీయ సమాచారం.