Ramya Krishna And Soundarya : సెలబ్రిటీలు వాళ్ల మధ్య ఎలాంటి గొడవల్లేకుండా సోదర, స్నేహ భావంతో మెలగుతున్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్పంటే, మా హీరో గొప్ప.. అంటూ రచ్చకెక్కుతుంటారు. అలాగే హీరోయిన్ల విషయంలోనూ.
అప్పట్లో రమ్యకృష్ణ, సౌందర్య ఇద్దరూ స్టార్ హీరోయిన్లే. సోలో హీరోయిన్లుగా ఎన్నో విజయాలు చవి చూశారు. అలాగే ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు కూడా.
ఫ్లైట్ యాక్సిడెంట్ కారణంగా అనూహ్యమైన రీతిలో సౌందర్య ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు.
చాలా విషాదకరమైన ఘటన అది. ఆమె మరణించి వుండకపోతే, ఇప్పటికీ సినిమాల్లో కొనసాగి వుండేవారేమో. రమ్యకృష్ణ లెజెండరీ నటిగానే ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్ని పాత్రలు ఆమె కోసమే పుట్టాయా.? అన్నట్లుగా అనిపిస్తుంటాయ్. అలాంటిదే ‘బాహుబలి’లో రాజమాత పాత్ర.
కాగా, అప్పట్లో ‘హలో బ్రదర్’, ‘నరసింహా’ తదితర సినిమాల్లో ఈ ఇద్దరు లెజెండరీ ముద్దుగుమ్మలు కలిసి నటించిన సంగతి తెలిసిందే. రెండూ సూపర్ డూపర్ హిట్ సినిమాలే. అయితే, ‘నరసింహా’ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్యా ఈగో క్లాషెస్ వచ్చాయని అంటారు.
అందుకు కారణం ఇరు వర్గాల ఫ్యాన్సే అంటారు.
అప్పటికే ఇద్దరూ స్టార్ హీరోయిన్లు. అలాంటప్పుడు రమ్యకృష్ణకు అంత రిచ్ క్యారెక్టర్, సౌందర్యకు పని పిల్ల క్యారెక్టర్ ఎలా ఇస్తారంటూ ఇద్దరి అభిమానులూ వారి మధ్య చిచ్చుకు కారణమయ్యారనే ఓ వాదన వుంది.
కానీ, మా ఇద్దరి మధ్యా ఎలాంటి ఈగో క్లాషెస్ లేవంటూ అప్పుడే వీరిద్దరూ ఖండించారు. కానీ, ఏదో తెలియని కోల్డ్ వార్ వీరిద్దరి మధ్యా జరుగుతుండేదని వారి సన్నిహితులు చెబుతుంటారు.
అయితే, సౌందర్య మరణం తనకు కోలుకోలేని షాక్ ఇచ్చిందనీ, చాలా కృంగుబాటుకు లోనయ్యాననీ, ఓ మంచి స్నేహితురాల్ని కోల్పోయాననీ రమ్యకృష్ణ చెప్పడం కొసమెరుపు.