‘బాహుబలి’ తరవాత మరో హిట్‌…!

సలార్‌ చిత్రంతో టాలీవుడ్‌ స్టార్‌ నటుడు ప్రభాస్‌ సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ’బాహుబలి’ ప్రాంఛైజీ తర్వాత ప్రభాస్‌ నుంచి ఆశించిన స్థాయిలో సినిమాలు రాలేదు. దీంతో చాలా కాలంగా ప్రభాస్‌ అభిమానులు హిట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్‌ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో డార్లింగ్‌ అభిమానుల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.

ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్దకు ఫ్యాన్స్‌ క్యూ కట్టారు. సినిమా థియేటర్స్‌ వద్ద టపాసులు పేల్చి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పలు చోట్ల ప్రభాస్‌ భారీ కటౌట్స్‌ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేసారు. డ్యాన్స్‌లు, డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు. కొన్ని చోట్ల థియేటర్స్‌ ముందు ప్రభాస్‌ పోస్టర్లు పెట్టి కొబ్బరికాయలు కొట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కేజీఎఫ్‌ ప్రాంఛైజీ లాంటి ఇండస్టీ బ్లాక్‌ బస్టర్‌ హిట్టందించిన ప్రశాంత్‌ నీల్‌ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సలార్‌లో శృతిహాసన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటించగా.. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్‌ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. మాలీవుడ్‌ స్టార్‌ హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ వరదరాజ మన్నార్‌ ది కింగ్‌ పాత్రలో నటించాడు.