ప్చ్.. కాలకేయకి కాపీలా “ఆనిమల్” విలన్ ని తయారు చేశారే..

మాములుగా హాలీవుడ్ సినిమాల్లో మనం కొన్ని రకాల మనుషులు జాతులు భసజలు మాట్లాడే తెగల వారిని చూస్తూ ఉంటాం అయితే మన ఇండియన్ సినిమా దగ్గర ఇలాంటి ఒక ఒక్క కొట్టుట ఎక్స్ పీరియెన్స్ ని కలిగించిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాహుబలి అని చెప్పాలి.

ఈ చిత్రంలో నటుడు ప్రభాకర్ చేసిన కాలకేయ పాత్ర చాలా మందికి గుర్తు ఉంటుంది. నిమ్డ గోజ్రాస్ తెల్మీ అంటూ చెప్పిన డైలాగ్ పెద్ద ట్రెండ్ అయ్యింది. అయితే అసలు ఆ సినిమాలో కాలకేయ లుక్ అనేది మన వాళ్ళు చూసి అప్పుడు షాక్ అయ్యారు థ్రిల్ అయ్యారు కూడా. అందుకే అది బాగానే క్లిక్ అయ్యింది.

అయితే ఇప్పుడు సేమ్ అదే తరహా లుక్ ని అచ్చు కాపీ కొట్టి సూర్య సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుణ్ని సెట్ చేసారు “కంగువ” మేకర్స్. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో రీసెంట్ గా ఆనిమల్ సినిమాలో విలన్ గా కనిపించి ఆడియెన్స్ కి ఇంప్రెస్ చేసిన నటుడు బాబీ డియోల్ ఉదిరన్ గా నటిస్తున్నట్టుగా ఒక మోస్ట్ పవర్ ఫుల్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఇది చాలా బాగుంది కానీ ఏమాత్రం సినిమా నాలెజ్జ్ ఉన్నా కూడా ఇది బాహుబలి నుంచి కాలకేయుడి ని కాపీ కొట్టిందే అని చెప్తారు. కనీసం కనుగుడ్డు కూడా మార్చలేదు. దాదాపు ఒకే గెటప్ కూడా డిజైన్ చేశారు. రెండు పోస్టర్స్ ని పక్కన పెట్టి టక్కున చెప్పమంటే కన్ఫ్యూజ్ కూడా అవుతాం అలా ఉంది పని. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.