‘అంటే సుందరానికీ’ నిర్మాణ సంస్థపై నమోదైన కేసు..

తాజాగా నాచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజే మంచి వసూళ్లతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. కానీ అంతలోనే ఈ సినిమా నిర్మాణ సంస్థపై కేసు నమోదయింది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే..

గురువారం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే అక్కడికి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా శ్రీయాస్ మీడియా ఈ ఈవెంట్ ని నిర్వహించింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించారు అంటూ ఆ మీడియా మేనేజర్ సురేష్ తో పాటు మైత్రి మూవీస్ పై 188సెక్షన్ కింద కేసు వేశారు.