వైకాపా మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావుని మచిలిపట్నం మార్కెడ్ యార్డ్ లో దుండగులు కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు నిందితుల్ని సీసీ టీవీ పుటేజీని ఆధారం చేసుకుని పరారైన వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిందుతుల నుంచి క్రైమ్ పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నిందుతులు ముగ్గురు వెనుక టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ ముగ్గురు నిందుతులు రవీంద్ర సహకారంతోనే కత్తితో పోడిచి చంపినట్లు వెల్లడించినట్లు పోలీస్ విచారణలో తేలింది.
మర్డర్ ప్లాన్ సహా…ఆయుధం అన్నింటిపై స్కెచ్ వేసి చంపించింది కొల్లు రవీందర్ అని నిందితులు వాంగ్ములం ఇచ్చారు. దీంతో పోలీసులు రవీంద్ర పై కేసు నమోదు చేసారు. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా పోలీసులు కొల్లు రవీందర్ ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపడితే కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇక మంత్రి నాని తన అనుచరుడి రాజకీయ క్షక్షతోనే చంపినట్లు వెల్లడించారు. రాజకీయంగా తనని ఎదుర్కునే దైర్యం లేక ఇలా దొంగ దెబ్బ తీసారి మంత్రి వాపోయారు.
తాజాగా ఈ మర్డర్ వెనుక టీడీపీ నేత ఉండటంతో కేసు మరింత సంచలనంగా మారబోతుంది. ఇప్పటికే టీడీపీ నేతలపై జగన్ సర్కార్ అరెస్ట్ ల పర్వాన్ని కొనసాగిస్తోంది. అవినీతి..అక్రమాలకు పాల్పడ్డ కేసుల్లో ఒక్కొక్కరిగా జైలు కెళ్తున్నారు. ఈఎస్ స్కామ్ లు, పోర్జరీ సంతకాలు, అక్రమవాహనాల కొనుగోళ్లు వంటి కేసుల్లో అడ్డంగా బక్కయ్యారు. ఇంకా ఇలాంటి అవినీతి పరుల లిస్ట్ జగన్ వద్ద పెద్దదిగానే ఉందని…వాళ్లపై కూడా ఏ క్షణమైనా రైడ్ జరిగే అవకాశం లేకపోలేదని వెబ్ మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే పార్టీ నేత ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది.