Shyamala: ఇటీవల ఎంతోమంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులో నమోదు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్టు గాక మరికొంతమంది పై కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై కూడా కేసులు నమోదు అయ్యాయి.
హర్ష సాయి పేదలకు సహాయం చేస్తున్నాము అనే ముసుగులో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా డబ్బు కోసం ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఎంతోమందికి ఇబ్బందులు కలగ చేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోతున్న సంగతి తెలిసిందే.
ఇలా తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే తనకు బదులుగా మరొకరు చేస్తారు అంటూ ఈయన మాట్లాడిన తీరుపై సజ్జనార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈయనపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఇక్కడ వరకు బానే ఉన్నప్పటికీ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వైసిపి మహిళా నేతను మాత్రం వదిలిపెట్టారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న యాంకర్ శ్యామల కూడ గతంలో ఇలాంటి ప్రమోషన్లను చేశారు అయితే ఇప్పటివరకు ఆమె గురించి ఎక్కడ చర్యలు తీసుకోలేదు. ఇలా శ్యామల ఈ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. అయితే అధికార బలం ప్రభుత్వ అండదండలు ఉన్న వారి పట్ల చర్యలు ఉండవా కేవలం సాధారణ వ్యక్తులను మాత్రమే అరెస్టు చేస్తారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి యాంకర్ శ్యామల ప్రమోట్ చేస్తున్న ఈ వీడియోలపై అధికారుల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుందనేది తెలియాల్సి ఉంది.