న‌గ్నంగా ప‌రిగెత్తిన న‌టుడు.. ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు

ఫేడ్ ఔట్ అవుతున్న స‌మ‌యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు పాపుల‌ర్ కావ‌డానికి వికృత చేష్ట‌లు చేస్తుంటారు. వ‌ర్మ లాంటోడు ఏదో ఒక కామెంట్ చేస్తూ త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటే, పూన‌మ్ పాండే లాంటి వాళ్ళు త‌ర‌చు ఎక్స్‌పోజింగ్ షో చేస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే రీసెంట్‌గా 55 ఏళ్ళ ప్రముఖ న‌టుడు, మోడ‌ల్ మిలింద్ సోమ‌న్ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా ప‌రిగెత్తి అందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తూ త‌న‌కు తాను బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలుపుకున్నాడు.

 

55 ఏళ్ల వయస్సులోనూ మంచి ఫిట్‌నెస్‌తో టోన్డ్ బాడీను మెయింటెయిన్ చేస్తున్న మిలింద్.. న‌గ్నంగా పరిగెత్త‌డాన్ని ప‌లువురు త‌ప్పుబ‌ట్టారు. ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో సెల‌బ్రిటీలు ఇలాంటి ప‌నులు చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ఆయ‌న‌ని విమ‌ర్శించారు. ప‌బ్లిసిటీ కోసేమ మిలింద్ ఇలా చేసాడ‌ని పలువురు ఆయ‌న‌పై నిప్పులు చెరిగారు. ఏదేమైన మిలింద్ సోమ‌న్ త‌న బ‌ర్త్‌డే రోజు న్యూడ్ ప‌రిగెత్తి అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. అయితే దీనిపై తాజాగా గోవా పోలీసులు కేసు న‌మోదు చేశారు. న‌గ్నంగా ప‌రుగెత్తినందుకు ఐపీసీ సెక్ష‌న్ 294 ప్ర‌కారం కొల్వా పోలీస్ స్టేషన్‌లో అత‌నిపై కేసు నమోదైంది అని దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ సింగ్ తెలిపారు.

గ‌తంలోను ప‌లు సంద‌ర్భాల‌లో మిలిన్ ఇలా న‌గ్నంగా ప‌రిగెత్తాడు. గ‌తంలో ఈ విష‌యం చాలా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒకప్పుడు సూపర్ మోడల్, మారథాన్ రన్నర్‌గా మంచి పేరు సంపాదించుకున్న మిలింద్ ఇలా చేయ‌డాన్ని కొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. ఇటీవ‌ల‌ రచయితగా కూడా మారాడు. మిలింద్ సోమన్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రముఖ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ రెండవ సీజన్‌లో కనిపించారు. అలీషా చినాయ్ రూపోందించిన మ్యూజిక్ వీడియో మేడ్ ఇన్ ఇండియా (1995)లో నటించిన మిలింద్‌.. సోమన్ చెఫ్, బాజీరావ్ మస్తానీ, డిసెంబర్ 16 వంటి పాపులర్ చిత్రాలలో నటించాడు.