Jacqueline Fernandez: జాక్వెలిన్ సోదరికి కోట్లలో డబ్బు ఇచ్చానన్న సుకేశ్.. స్పందించిన హీరోయిన్?

Jacqueline Fernandez: ఇటీవల కాలంలో దాదాపు 200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో భాగంగా సుకేశ్ చంద్రశేఖర్ పేరు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈయన ఎన్నో రకాల మోసాలకు తెరలేపి పెద్దఎత్తున అందరినీ మోసం చేశారని ఇతని పై కేసు నమోదు కావడంతో ప్రస్తుతం ఈయనని అధికారులు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో భాగంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఇక ఈ విచారణలో భాగంగా ఆమె ఎన్నో విషయాలను బయటపెట్టింది.

ఈ సందర్భంగా జాక్వెలిన్ మాట్లాడుతూ…సుకేష్ యూఎస్ఏలో ఉన్న తన సోదరి గెరాల్డైన్‌కి 1.5 లక్షల డాలర్లు (దాదాపు కోటి 10 లక్షలు) ట్రాన్స్‌ఫర్ చేశాడు. అయితే తను త్వరలో సౌత్ ఇండియాలో సన్ టీవీ ఎన్నో సినిమాలను నిర్మిస్తోందని, అందులో నన్ను నటించమని కోరాడు. ఇలా అతనితో కాస్త పరిచయం ఏర్పడిందని తెలిపింది. అంతే కానీ తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని జాక్వలిన్ ఈడీ అధికారుల ఎదుట తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన సుకేష్ మాట్లాడుతూ నటి జాక్వెలిన్ అబద్ధం చెబుతోందని…నేను తన సోదరికి సుమారు కోటి 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానని అదేవిధంగా 15 చెవిపోగులు, ఐదు బిర్కిన్ బ్యాగ్‌లు, ఇతర కాస్టీ బ్యాగ్‌లను బహుమతిగా ఇచ్చాను. కార్టియర్ బ్యాంగిల్స్, టిఫనీ బ్రాస్‌లెట్లను కానుకగా అందించడమే కాకుండా రూ. 7 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు, చెవిపోగులను తనకు బహుమతిగా పంపించానని ఈ సందర్భంగా సుకేష్ చంద్రశేఖర్ తెలిపారు.