Raveena Tandon: కేజిఎఫ్ సినిమాతో సంచలనంగా మారిన నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించిన ఈమె కేజీఎఫ్ సినిమా ద్వారా సంచలనంగా మారారు. కేజిఎఫ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనాటాండన్ తాను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేది అనే విషయాల గురించి వెల్లడిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ క్రమంలోనే తాను ఇండస్ట్రీలోకి రాకముందు కాలేజీ చదువుతున్న రోజులలో జెనెసిస్ పీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాను. అక్కడ యాడ్ డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్‌కు సహాయంగా ఉండేదాన్ని. ఇలా అతనికి సహాయంగా ఉంటూ స్టూడియోలో ఫ్లోర్ శుభ్రం చేస్తూ పని చేసేదాన్ని. అలాగే ఎవరైనా వాంతి చేసుకున్నా దానిని కూడా శుభ్రం చేస్తూ ఉన్న తనకు తన తోటి స్నేహితులు నువ్వు చాలా అందంగా ఉన్నావు సినిమాలలో ప్రయత్నాలు చేయవచ్చు కదా అని సలహా ఇచ్చారు. అయితే వారి మాటలను తాను పట్టించుకోలేదని రవీనా వెల్లడించారు.
కానీ తనలో ఉన్న మోడల్ ను గుర్తించింది మాత్రం శాంతను షీరే అనే ఫొటోగ్రాఫర్, డైరెక్టర్. ఆయనే నన్ను మోడల్ గా నిలబెట్టారు.ఇలా మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తనకు సినిమా అవకాశాలు వచ్చాయి. మొదట్లో సినిమాలలో నటించనని ఆ అవకాశాలను రిజెక్ట్ చేసేదాన్ని అయితే డైరెక్టర్ ప్రహ్లాద్ కక్కర్‌కు సూచన మేరకు తాను మొట్టమొదటిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫత్తర్ కే ఫూల్ అనే సినిమాలో నటించానని రవీనా టాండన్ వెల్లడించారు. ఈమె నటించిన మొదటి సినిమాకు ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం. ఇలా ఇండస్ట్రీకి రాకముందు రవీనా టాండన్ చేసిన పనుల గురించి ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.