అరవింద్ స్వామి ఒక భారతీయ నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన మోడల్, టెలివిజన్ వ్యాఖ్యతగా, తమిళ సినిమాలలో బాగా ప్రసిద్ధి చెందాడు. ఈయన 1991లో మణిరత్నం దర్శకత్వం వహించిన తలపతి చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆ సంవత్సరం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత రోజా, బొంబాయి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగి దక్షిణాదిలోనే స్టార్ గా గుర్తింపు పొందాడు. 1994లో గాయత్రీ రామమూర్తిని వివాహం చేసుకున్నాడు వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. ఇక వివాహం తర్వాత ఒకవైపు తన తండ్రి బిజినెస్ లను చూసుకుంటూ, మరోవైపు సినిమా రంగంలో స్టార్ గా ఎదిగి రాణిస్తున్న సమయంలో తనను భార్య సరిగా అర్థం చేసుకోలేకపోయింది.
తాను కష్టపడి సంపాదించింది కుటుంబం కోసమే అని తెలుసుకోలేక పోయింది. కొన్ని మనస్పదల కారణం ద్వారా విడిగా ఉండి 2010లో చట్టబద్ధంగా విడాకులు తీసుకోవడం జరిగింది. పిల్లల సంరక్షణ కోర్టు అరవింద్ స్వామికి అప్పగించింది. అప్పటినుంచి ఆ పిల్లలకు తల్లిలోని లోటు తీరుస్తూ వారి కోసం వంట నేర్చుకొని వారికి కావాల్సినవన్నీ తానే సమకూర్చేవాడు.
ఒకసారి యాక్సిడెంట్ ద్వారా వెన్నుముకకు గాయం అయ్యి కొంతకాలం కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టం అయింది. తనను, తన పిల్లలను చూసుకోవడానికి అపర్ణా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. తన మొదటి భార్య తనను అర్థం చేసుకోలేక పోయిందని మానసికంగా ఎంతో బాధపడ్డాడు. ఇక పిల్లల విషయంలో వారు ఏదైనా సలహా అడిగితేనే చెబుతాడట. పిల్లలకు నచ్చిన విధంగా ఉంటూ వారి విషయంలో జోక్యం చేసుకోకుండా, వారికి కావలసినవన్నీ తానై చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం అరవింద్ స్వామి ఒట్టు, రెండగం, నరగాసూరన్, కల్లపార్ట్ వంటి