చైనాలో ప్రారంభమైన వైరస్ విజృంభన తర్వాత, యూరప్‌లో కొనసాగింది. అనంతరం అమెరికాలో విస్తరించి ఇప్పటికీ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం యూరప్‌లో వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ, ఉత్తర, దక్షిణ అమెరికాలతోపాటు భారత్‌లో ఈ మహమ్మారి విలయతాండవంచేస్తోంది.
గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,81,911 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 93,337 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 95వేల మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
నిన్న మరో 1247 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 85,619కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28శాతానికి చేరగా.. మరణాల రేటు 1.61శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.