ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన కరోనా పేషంట్

ప్రభుత్వాసుపత్రులు అనగానే చాలా మందికి సహజంగానే ఏవగింపు. ఒక్కోసారి అక్కడ చోటుచేసుకునే సంఘటనలను చూస్తే వాళ్లు అసలు మనుషులేనా అనే ఫీలింగ్ కలుగుతుంది… అయితే సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్లు… వాళ్లకు ఉన్నవనరులు చాలా పరిమితం అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అయితే ధనార్జనే ధ్యేయంగా పనిచేసే ప్రయివేట్ ఆసుపత్రుల కంటే సర్కారీ దవాఖాణాలు ఒక్కోసారి మెరాకిల్స్ చేస్తుంటాయి. అక్కడి వైద్యుల్లో దాగి ఉన్న మానవత్వాన్ని చూసి ప్రయివేట్ ఆసుపత్రులే తలదించుకుంటూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రభుత్వుసుపత్రిలో కోవిడ్ తో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. పెళ్లై నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో అధునిక సైన్స్ అండ్ టెక్నాలజి పుణ్యాణ అందుబాలోకి వచ్చిన ఐయూఐ చికిత్సను ఆశ్రయించి గర్భం దాల్చింది. అయితే విశ్వమంతా విస్తరించిన కోవిడ్ మహమ్మారి ఈ గర్భిణిని కూడా ఆవహించింది. ఆరోగ్యం విషమించడంతో ముందుగా నిజామాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకోగా కరోనా సోకిందని తేలింది. అప్పటికే ఎనిమిది నెలల గర్భవతి అయినా దైర్యం కోల్పోకుండా కరోనా చికిత్స తీసుకొని కోలుకుంది. కరోనా నుంచి కోలుకుందో లేదో నెలలు నిండేశాయి.  కరోనా తగ్గినా కరోనా వైరస్ ఇంకా కొంత కాలం శరీరంలోనే ఉంటుంది కదా అదీ సంగతి… కరోనా పేరుతో లక్షలకు లక్షలు ఖాజేస్తున్న ప్రయివేట్ ఆసుపత్రులు ఈమెకు డెలివరీ చేసేందుకు మాత్రం అంగీకరించలేదు.

ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రే దిక్కైంది.  ఇక్కడి వైద్యులు మానవతా దృక్పథంతో సాహసించారు. నిండు గర్భిణిని అడ్మిట్ చేసుకొని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. పీపీఈ కిట్లు ధరించి సిజేరియన్ చేశారు. ప్రసవంలో ఏకంగా ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగ శిశువులతో పాటు ఓ ఆడ శిశుపు జన్మించారు. తల్లితో పాటు ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ పరీక్షల్లో వారికి నెగెటివ్ రావడంతో అందర్ని ఇంటికి పంపించారు.