Corona Vaccine:12 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు కార్బెవాక్స్‌ టీకా పంపిణీ..!

Corona vaccine: 2 సంవత్సరాల క్రితం చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఒక్కో వేవ్ లో ఒక్కో రకంగా రూపాంతరం చెంది ప్రజల మీద దాడి చేసింది. తిరుపతి వరకు కరోనా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడి చేయటానికి ప్రభుత్వం అందించడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 181 కోట్లకు పైగా టీకా డోసులను ప్రభుత్వం పంపిణీ చేసింది .

ఇటీవల 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కార్బెవాక్స్‌ టీకా ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్‌ టెక్నికల్‌ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ ఇప్పటికే కార్బేవాక్స్ గురించి కేంద్రానికి సిఫార్సులు చేసింది. కేంద్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించి.. 12-14 ఏళ్ల వారికి బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ టీకాను ఇవ్వనుంది.

ఈ క్రమంలో ప్రికాషన్‌ డోసులు తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మార్చి 16 నుంచి 60ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషనరీ డోసు ఇవ్వనుంది. ఈ ఏడాది జనవరి 10 నుంచి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడిన ఇతర అనారోగ్య సమస్యలున్న వారికి ప్రికాషనరీ దోస్తులు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.