షన్నూకెప్టెన్ అయ్యాడోచ్: కొన్నికొన్ని అలా జరిగిపోతాయంతే.!

బిగ్ హౌస్‌లో కెప్టెన్ అవ్వడం అంటే, అదో గౌరవం. కెప్టెన్ మాటను హౌస్ మేట్స్ అంతా గౌరవించాలి. ఇంతవరకూ అదే జరుగుతూ వస్తోంది. కానీ, ఈ సీజన్‌లో కెప్టెన్ అన్నా, కెప్టెన్సీ కోసం జరిగే పోటీ అయినా అస్సలేమాత్రం పస లేకుండా పోయింది. కష్టపడి సాధించుకునే అర్హతే కెప్టెన్సీ.

ఆ అరుదైన గౌరవం కోసం జరిగే పోటీ కూడా అంతే టఫ్‌గా సాగాలి. కానీ, ఈ సీజన్‌లో పోటీ కోసం జరిగే ఏ టాస్క్‌లోనూ టఫ్‌నెస్ ఉండట్లేదు. టఫ్ మాట అలా ఉంచితే, అసలు లాజిక్కే ఉండడం లేదు. మరీ పిచ్చి పిచ్చి టాస్క్‌లు. టాస్క్‌ల కోసం గేమ్స్ దొరకట్లేదా.. బిగ్‌బాస్.? లేదంటే ఒక్కసారి సుమక్కతో చర్చించండి. ఇలాంటి పిచ్చి గేమ్‌ల్లో పీహెచ్‌డీ చేసేసిందామె. సుమక్కనే మించి పోయారుగా తమరు.

అలాంటి ఓ పిచ్చి టాస్క్‌తోనే షన్నూ ఈ వారం కెప్టెన్ అయిపోయాడంతే. పాపం శరీరాన్ని అస్సలు కష్టపెట్టకుండా ఈ లేజీ బాయ్ కెప్టెన్ అయిపోయాడు. ఆర్ యూ ఏక్‌సెప్టెడ్ ఆడియన్స్.. అదంతే కొన్ని కొన్ని అలా జరిగిపోతాయంతే. అవునన్నా, కాదన్నా ఒప్పుకుని తీరాల్సిందే. అలాగే షన్నూ కెప్టెన్సీ కూడా. దట్స్ ఇట్.