మూడు రాజధానుల బిల్లు, సీఆర్ డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకం కోసం రాజ్ భవన్ కు వెళ్లిన నేపథ్యంలో ఏం జరుగుతుందా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బిల్లుల విషయంలో గవర్నర్ వద్ద మూడు ఆప్షన్లు ఉన్నాయి. బిల్లులపై ఆయన సంతకాలు చేసి చట్ట రూపం దాల్చేలా చేయడం ఒకటి కాగా….న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లడం రెండవ ఆప్షన్ కాగా….బిల్లులను తాత్కలికంగా పెండింగ్ లో పెట్టడం మూడవ ఆప్షన్ గా కనిపించాయి. చివరిగా గవర్నర్ రెండవ ఆప్షన్ ని ఎంచుకుని న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు.
ఇదే సమయంలో పీఎంవో కార్యాలయం కూడా బిల్లులపై వివరణ అడిగింది. తాజాగా ఈ మొత్తం వ్యవహారం జగన్ సర్కార్ అనుకూలంగానే ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో గవర్నర్, కేంద్రం ముందు నుంచి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని అనేది రాష్ర్ట ప్రభుత్వం ఇష్టం మేరకు ఏర్పాటు చేసుకునేదని, అదీ పరిపాలన వికేంద్రీకరణ కు దేనికి కేంద్రం అడ్డు పడుతుందని అభిప్రాయం క్లియర్ గా చెప్పేసింది. ఇక గవర్నర్ ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశంలో భాగంగా తొలి రోజు సమావేశంలో పాలన వికేంద్రీకరణకు అనుకూలంగానే స్పందించారు. మూడు రాజధానులు చేస్తే రాష్ర్ట వ్యాప్తంగా అభివృద్ధి బాగుంటుందని కుండబద్దలు కొట్టేసారు.
తాజాగా న్యాయ నిపుణుల సలహా కూడా ప్రభుత్వం భావించినట్లే ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుకి చట్ట పరంగా ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే తెలుస్తోంది. అన్నింటిని దాటుకుని చివరిగా బిల్లులు రెండూ రాజ్ భవన్ కు చేరుకున్నట్లు సమాచారం. ఇక గవర్నర్ సంకతం చేసి రాష్ర్ట ప్రభుత్వానికి పంపిoచడమే ఆలస్యమని సమాచారం. దీంతో మూడు రాజధానుల అభిమానులు సంబురాలు షురూ చేసుకోవచ్చని సంకేతాలు అందేసాయి. అమరావతితో పాటు కర్నూలు, విశాఖపట్టణం కూడా రాజధానులుగా అవతరించబోతున్నాయి.