నారా లోకేష్ మాట్లాడితే ఒకప్పుడు కామెడీగా ఉండేదేమో కానీ ఇప్పుడు అలా లేదు. లాజిక్కులు, లెక్కలు పక్కాగా మాట్లాడుతున్నారు ఆయన. ఇంతకుముందులా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును అప్పజెప్పడం లేదు. పక్కా పొలిటికల్ లాంగ్వేజీలోనే మాట్లాడుతున్నారు. ఉన్నపళంగా బయటికొచ్చి వరద ప్రాంతాల్లో పర్యటించి, రైతుల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఈ పర్యటన గురించి మాట్లాడిన వైసీపీ మంత్రులు పర్యటనలో లోకేష్ ట్రాక్టరు సరిగ్గా తోలలేదనిఎగతాళి చేశారు తప్ప ఆయన రైతులను పరామర్శించిన సంగతిని పట్టించుకోవట్లేదు. చాలన్నాళ్ళు లోకేష్ మీద జోకులేస్తే జనం కూడ సరదగా నవ్వుకున్నారు కానీ ఇప్పుడు వాళ్లకు కూడ బోర్ కొట్టేసింది.
స్పెల్లింగ్ మిస్టేకులు వెతక్కుండా అసలు లోకేష్ బాధ ఏమిటో ఆలకిస్తున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్లో లోకేష్ అవినీతికి పాల్పడ్డారని పాలకవర్గం అంటూ ఉంటుంది. లోకేష్ ఏమో నిరూపిస్తే జైలుకెళతానని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. కానీ నిరూపించే ఆధారాలేవీ వైసీపీ నేతలు బయటకు తీయట్లేదు. అంతెందుకు ఈరోజు మీడియాతో మాట్లాడిన లోకేష్ మూడు రాజధానుల మీద, పేదలకు ఇళ్ల స్థలలా పంపిణీ మీద చంద్రబాబు నాయుడు కోర్టులకెళ్లారని, స్థలాల మీద కోర్టులో పిటిషన్లు వేసిందని మీరు నిరూపించగలరా అంటూ మంత్రి బొత్సకు సవాల్ విసిరారు. అంతేకాదు వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. నా దగ్గర ఆధారాలున్నాయి. నిరూపిస్తాను. సవాలుకు మీరు సిద్దమేనా అన్నారు.
కోర్టు అమరావతి భూములను పేదలకు ఇళ్ల పట్టాల కింద పంపిచడం మీద స్టే ఇచ్చిన నాటి నుండి చంద్రబాబు నాయుడే కోర్టుకు వెళ్లి భూ పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని, పేదలు బాగుపడితే చూడలేరని, జగన్ చేయాలనుకున్న ఉచిత పట్టాల కార్యక్రమానికి అడ్డుతగులుతున్నారని వైసీపీ లీడర్లు ఎంతలా గోలచేశారో అందరికీ తెలుసు. పేదల ఇళ్ల స్థలాల పట్టాలకు కన్వేయన్సు డీడ్లు ఇవ్వకూడదనే నియమం ఒకటుంది. దాన్ని ఉల్లంఘిస్తున్నారనే కోర్టు నో స్టే ఇచ్చింది. కానీ ఆ నెపాన్ని చంద్రబాబు మీదకు తోసేశారు. ఇప్పుడేమో లోకేష్ స్టేలు తీసుకొచ్చింది మీవారే, నిరూపిస్తాను అంటున్నారు. మరి ఆయన్ను ఎగతాళి చేసేవారంతా ఆయన సవాలును కూడ స్వీకరించి తప్పు చంద్రబాబుదేనని నిరూపించు కదా.