Lord Shani: శనీశ్వరుడి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేయవచ్చా.. చేస్తే ఏం జరుగుతుంది?

Lord Shani: సాధారణంగా శనీశ్వరుడి పేరు వినగానే చాలామంది వెనకడుగు వేస్తారు. శనీశ్వరుడు అంటే ఒక ఒక భయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. శనీశ్వరుడు అశుభానికి సంకేతం అని ఒక్కసారి ప్రభావం మనపై ఉంటే జీవితమే అయోమయ పరిస్థితులలోకి పడుతుందని భావించి శనీశ్వరుని పూజించడానికి ఇష్టపడరు. కానీ శని ఎవరైతే కర్మ చేసే ఉంటారు వారి కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రమే అందిస్తాడు కానీ అందరి పై తన ప్రభావాన్ని చూపడు.

ఈ క్రమంలోనే కొందరు శనీశ్వరుడికి నిత్యం పూజలు చేస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఇలా శనీశ్వరుడిని పూజించేవారు శని దేవుడి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తుంటారు. అయితే శనీశ్వరుడి ఫోటోని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకో కూడదని పండితులు చెబుతున్నారు. శనీశ్వరుడు ఒక గ్రహం కనుక కేవలం ఆ దేవుడు సూచించిన పనులను మాత్రమే చేస్తారు. అందుకోసమే శనీశ్వరుడిని మాత్రమే కాకుండా ఏ గ్రహాల ఫోటోలను ఇంట్లో పెట్టుకోకూడదు.

ఇలా నవగ్రహాల ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఎన్నో ఇబ్బందులు తలెత్తడమే కాకుండా, దరిద్రం కూడా కలుగుతుంది. నవగ్రహాలు కేవలం ఆలయాలలో మాత్రమే ఉండాలి. ఇలా మన జాతకంలో ఏదైనా గ్రహదోషాలు ఉన్నప్పుడు ఆలయానికి వెళ్లి గ్రహ దోష పరిహారం పూజ చేయించుకోవాలి కానీ, ఇలా నవగ్రహాలను ఇంటిలో ప్రతిష్టించ కూడదు.