Naga Babu: నాగబాబుకు ఆ శాఖ ఇవ్వటం పవన్ కు ఇష్టం లేదా…. కారణం అదేనా?

Naga Babu: ఏపీ క్యాబినెట్ విస్తరణ త్వరలోనే జరగబోతున్న విషయం మనకు తెలిసిందే ఈ నెలాఖరిలో ఏపీ క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని తెలుస్తుంది అయితే ఈ క్యాబినెట్ విస్తరణలో భాగంగా కొత్తవారు మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందులో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ఎంతో కీలక పాత్ర పోషించిన నాగబాబుకు ఏపీ క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నారు.

ఇప్పటికే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అధికారకంగా వెల్లడించారు. ఇకపోతే నాగబాబును ముందుగా ఎమ్మెల్సీగా తీసుకొని అనంతరం మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇలా నాగబాబు మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ఈయనకు ఏ శాఖ ఇవ్వబోతున్నారనే విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే నాగబాబుకు టూరిజం తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు ఇస్తున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

ఇలా ఈ రెండు శాఖలు నాగబాబుకు కేటాయించబోతున్నారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో మరో వార్త హల్చల్ చేస్తుంది తన అన్నయ్యకు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని సమాచారం. ఇప్పటికే ఈ రెండు శాఖలను జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకొని చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనని కాదని నాగబాబుకు టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వటం మంచిది కాదని పవన్ భావిస్తున్నారట.

ముఖ్యంగా సినిమాటోగ్రఫీ తన అన్నయ్య నాగబాబుకు ఇవ్వటం పట్ల ఈ శాఖలో ఎంత మంచిగా విధులు నిర్వహించిన వచ్చే ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా ఉంటాయని పవన్ భావిస్తున్నారట తన కుటుంబంలో చాలామంది హీరోలు ఉన్న నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా నాగబాబుకి బాధ్యతలు అప్పచెబితే ఏ చిన్న తప్పు జరిగిన విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే తన అన్నయ్యకు ఆ శాఖ ఇవ్వటం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదట. ఇక ముందుగా కీలకమైన శాఖ కాకుండా నాగబాబుకు నామమాత్రపు శాఖను కట్టబెట్టాలని, కొద్దిగా శాఖపై పట్టుసంపాదించుకున్న తర్వాత ముఖ్యమైన శాఖలను కేటాయించాలని భావించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే యువజన సర్వీసుల శాఖతో పాటు మత్స్యకారుల సంక్షేమ శాఖను అప్పగించాలన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలుస్తోంది.